తెలంగాణ : టేకు కలప అక్రమ రవాణా ఎలా చేస్తున్నారో చూస్తే.. షాకవ్వాల్సిందే…!

తెలంగాణ : టేకు కలప అక్రమ రవాణా ఎలా చేస్తున్నారో చూస్తే.. షాకవ్వాల్సిందే…!

వాజేడు ,మన సాక్షి :

అత్యంత విలువైన టేకు కలప అటవీ అధికారుల కళ్ళు కప్పి సరిహద్దు ప్రాంతాలకు దాటించే ప్రయత్నం విఫలం అయ్యింది. ఈ సంగటన తెలంగాణ బోర్డర్ ప్రాంతంలో టేకులగూడెంలో వెలుగులోకి వచ్చింది,

 

వివరాల్లోకి వెళితే ఇసుక కాంట్రాక్టర్లు లారీ ఓనర్లు కుమక్కయి ఇసుకలో సంపాదించే అక్రమ సంపాదన చాలక ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని పలు ఆరోపణలు వెక్తం అవుతున్నాయి.

 

ఇసుక కాంట్రాక్టు, లారీ ఓనర్ ప్రమేయం లేనిది ఇంతటి అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలకు పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి,

 


గడిచిన కాలంలో కొన్ని వేల లారీలలో తరలించిన ఇసుక లారీల గురించి పలు అనుమానాలు వచ్చి వాటి గురించి వాటి వివరాలు గురించి ఫారెస్ట్ అధికారులు ఆరా తీయనున్నారు, కలప అక్రమ తరలింపు గురించి మండలంలో ఎవరో వారికీ అనుచరులు వున్నారని అధికారులకు అనుమానాలు వస్తున్నాయి.

అటవీ శాఖ యఫ్ ఆర్ ఓ చంద్రమౌళి. కదనం ప్రకారం… విశ్వసనీయ సమాచారం ప్రకారం… తెలంగాణ -చతీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో గల లొటపిటల గండి వద్ద AP16TB5757లారీని ఆపి .. వచ్చిన సమాచారం గురించి గుట్టుగా ఆరా తీసి లారిని ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ ప్రాంతీయకార్యాలయానికి పంపించి సోదాలు నిర్వహించారు.

 

లారీలో ఇసుకను ఫారెస్ట్ సిబ్బందే అన్లోడ్ చేసి దాచిన టేకు దుంగలు( 12), టేకు చెక్కలు (60) వెలికి తీసారు. సుమారుగా పది లక్షలు విలువ చేసే కలపను, లారీని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకొని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునమని అధికారులు తెలిపినారు.