Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవిద్య

Inter Exams : 28 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఆ సమయం లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి..!

Inter Exams : 28 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఆ సమయం లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ఈనెల 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 9, 80, 978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, అందుకోసం 1521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 4, 78,718 మంది విద్యార్థులు, ఇంటర్ సెకండియర్ లో 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు.

ALSO READ: Telangana : బతికున్న రైతులను చంపేశారు.. రైతుబంధు, రైతు బీమాలో రెండు కోట్లు స్వాహ..!

ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రతి ఒక్కరు 9 గంటల లోపే చేరుకోవాలని, తొమ్మిది గంటల తర్వాత అనుమతి లేదని తెలియజేశారు. సీసీ కెమెరాలు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశామని, 100% సిలబస్ పూర్తి చేసినట్లు ఆమె తెలియజేశారు.

జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం కూడా చేసినట్లు ఆమె తెలియజేశారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రాలలోకి మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని, విద్యార్థులు ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే అని గుర్తుంచుకోవాలని తెలిపారు.

 

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.

మరిన్ని వార్తలు