కర్ణాటకలో ఇవ్వరు.. తెలంగాణలో ఇస్తామని బీరాలు..!

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాలని పథకాలు ఇక్కడ చేస్తారా ? అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి పార్టీ మహా రెడ్డి భూపాల్ ప్రశ్నించారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని కంగ్టి, రాంతీర్థ్, భీమ్రా , నాగూర్ బీ, గ్రామాల్లో ప్రచారం చేశారు.

కర్ణాటకలో ఇవ్వరు.. తెలంగాణలో ఇస్తామని బీరాలు..!

– నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మహా రెడ్డి భూపాల్ రెడ్డి,

కంగ్టి, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాలని పథకాలు ఇక్కడ చేస్తారా ? అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి పార్టీ మహా రెడ్డి భూపాల్ ప్రశ్నించారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని కంగ్టి, రాంతీర్థ్, భీమ్రా , నాగూర్ బీ, గ్రామాల్లో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నది బిఆర్ఎస్ అని అన్నారు. రైతుబంధు పథకాన్ని ఆపేయాలని ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులకు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలన్నారు.

కాంగ్రెస్కు ఓటేస్తే కర్ణాటక గతే పడుతుందని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీ గుర్తు కారుకే ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపిస్తే తెల్లరేషన్ కార్డ్ పై ప్రతి కుటుంబానికి సన్న బియ్యం రూ.400 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.

ALSO READ : సూర్యాపేట : బి ఎస్ పి సర్పంచ్ కిడ్నాప్ కు యత్నం

తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చన వచ్చిన మార్పులను గమనించాలని ఆ మార్పు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమైందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంగారం, ఎంపిపి సంగీత వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ రేఖ చంద్రశేఖర్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సిద్దు రమేష్, నాయకులు బస్వరాజ్ పాటిల్, దిలీప్ పటేల్, విశ్వనాథ్, పవన్, కాశీనాథ్, నాగేష్ రావు, అనిల్ గౌడ్, తదితరులు ఉన్నారు.

ALSO READ : కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యం – వివేక్ వెంకటస్వామి