కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యం – వివేక్ వెంకటస్వామి

ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన్నట్లు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యం – వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ , మన సాక్షి :

ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన్నట్లు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆయన కుమారుడు వంశీతో పాటు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఎంతో బాగుపడుతుందని భావించినట్లు చెప్పారు. కానీ కెసిఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు.

ALSO READ : తెలంగాణలో కాంగ్రెస్ తో కమ్యూనిస్టులకు పొత్తు ఉన్నట్టా..? లేనట్టా..?

తమ కుటుంబం ఆకాంక్షల మేరకే కేసీఆర్ పని చేస్తున్నారని విమర్శించారు. టికెట్ అనేది తనకు ముఖ్యం కాదని కెసిఆర్ సర్కార్ నుండి తెలంగాణ ప్రజలను విముక్తి కల్పించడమే తన లక్ష్యం అన్నారు. తెలంగాణ సాయుధ సాధన కోసం పోరాటం చేసినట్లు గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందరు కలిసికట్టుగా పనిచేసి కెసిఆర్ దింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామికి గాంధీ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరడం తన సొంత గూటికి వచ్చినట్టే అన్నారు . ఆయన చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందన్నారు.

ALSO READ : KCR : గన్ మెన్ కు దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఎందుకో తెలుసా..!