తెలంగాణ కొత్త ప్రభుత్వానికి జగన్ ట్వీట్.. రేవంత్ రీ ట్వీట్ ఏంటంటే..!

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

తెలంగాణ కొత్త ప్రభుత్వానికి జగన్ ట్వీట్.. రేవంత్ రీ ట్వీట్ ఏంటంటే..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, మంత్రివర్గానికి అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ALSO READ : BREAKING : కెసిఆర్ కు తీవ్ర అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స..!

కాగా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రేవంత్ రెడ్డి రీట్వీట్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సంబంధాలు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని ఆయన తెలిపారు.

ALSO READ కూలిన ప్రగతి భవన్ గేట్లు.. తొలగించిన ముళ్ళ కంచె..!