Nalgonda | తెలంగాణ సంపద లూటీ చేస్తున్న కేసీఆర్

Nalgonda | తెలంగాణ సంపద లూటీ చేస్తున్న కేసీఆర్

ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే

నల్లగొండ , మన సాక్షి:

తెలంగాణ ప్రజల సంపదను సీఎం కేసీఆర్ లూటీ చేస్తున్నాడని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే విమర్శించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆదివారం నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా బట్టి పాదయాత్రకు సంఘీభావం తెలిపి అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

 

డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారని, తెలంగాణకు ఎన్నికల ఇన్చార్జిగా వస్తాడనేది జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వచ్చినట్టుగానే డీకే శివకుమార్ వస్తారు. ఆయన సేవలు వాడుకుంటామని తెలిపారు.

 

బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గొప్పల గురించి
ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవడానికి అక్కడి మీడియాకు వందల కోట్ల రూపాయల ప్రజల సంపదను ఖర్చు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

 

కెసిఆర్ తన సొంత ప్రచారం కోసం వందల కోట్ల రూపాయలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న మీడియాకు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. సొంత రాష్ట్రంలో ఉన్న మీడియాను తొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ బలోపేతానికి విజయవంతం అయ్యిందని అన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి వెనక్కి గుంజుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పెద్దలకు కట్టబెడుతున్నదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని,చిన్న సన్న రైతులకు కలిగే ప్రయోజనం శూన్యమని అన్నారు.

 

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కలలను, ప్రజల ఆకాంక్షలను బిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తు కోసం తెచ్చిన కొత్త ప్రాజెక్టులు ఏమున్నాయి? కొత్త విద్యాసంస్థలు తీసుకురాలేదు. కొత్త పవర్ ప్రాజెక్టులు ప్రారంభించలేదని అన్నారు.

 

గమ్యం, గమనం లేని పొద్దుతిరుగుడు పువ్వు గుత్తా సుఖేందర్రెడ్డి :

సీఎల్పీ నేత బట్టి విక్రమార్క:

అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అధికారం చుట్టు తిరిగే వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తున్న నాకు గమ్యం, గమనం ఉందని, భగ భగ మండుతున్న ఎండలు, గాలి వానలతో టెంట్లు కూలిన, అకాల వర్షంలో తడుస్తూ నడిచానే తప్ప పాదయాత్ర ఎక్కడ ఆపలేదని అన్నారు.

 

42 వేల కోట్ల నిధులతో ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ నీళ్ళు నేను పాదయాత్ర చేసిన గ్రామాల్లో 90% కనిపించలేదు. ఖాళీ గా ఉన్న పైపులు, కట్టిన ట్యాంకులను ప్రజలు చూయించారని విమర్శించారు.

నీళ్ల పండుగ పేరుతో జలాల్లో పసుపు, కుంకుమ వదులుతున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లు ఎస్ ఎల్ బి సి టన్నెల్, నక్కలగండి పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

ఈ విలేకరుల సమావేశంలో ఎఐసిసి నాయకులు రోహిత్ చౌదరి, బీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.