Telangana : అసెంబ్లీలో వాటర్ వార్..!

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం అధికార ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాటర్ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలోనే కృష్ణా జలాలను ఆంధ్రకు దోచి పెట్టారని అధికార కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

Telangana : అసెంబ్లీలో వాటర్ వార్..!

అసెంబ్లీలో నీటి పై చర్చ జరుగుతుంటే కెసిఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు : రేవంత్ రెడ్డి

సభలో హరీష్ రావు అన్ని అబద్ధాలే చెబుతున్నాడు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

తీర్మానానికి మద్దతు ఇస్తున్నారా లేదా చెప్పకుండా డొంక తిరుగుడు మాట్లాడుతున్నారు : బట్టి విక్రమార్క

కృష్ణా జలాలు కెఆర్ఎంబీ కి అప్పగించే ప్రసక్తే లేదు.. రేవంత్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో:

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం అధికార ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాటర్ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలోనే కృష్ణా జలాలను ఆంధ్రకు దోచి పెట్టారని అధికార కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గతంలో కేంద్రానికి రాసిన లేఖలను నేటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చదివి వినిపించారు.

10 సంవత్సరాల కాలంలో కృష్ణా జలాలను కాపాడుకోలేక పోయారని తమ ప్రభుత్వం కృష్ణా జలాల రక్షణకు కట్టుబడి ఉందన్నారు . కృష్ణా జలాలను ఆంధ్రకు తరలించేందుకు జగన్ ప్రభుత్వంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణకు అన్యాయం చేశాడని అధికార పక్ష మంత్రులు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తూ జనవరి మాసంలో సంతకాలు చేసిందని లేఖలు చూపించారు.

ALSO READ : కెసిఆర్ ఆఖరి అస్త్రం.. నల్లగొండలో సెంటిమెంటు రగిలించే ప్రయత్నమేనా..?

తమ ప్రభుత్వం కృష్ణా జలాల రక్షణ కట్టుబడి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తూ తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం కల్పించుకొని హరీష్ రావు చూపించే పత్రాలన్నీ అబద్దాలని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పకుండా హరీష్ రావు డొంక తిరుగుడు మాట్లాడుతూ సమయం వృధా చేస్తున్నారని అన్నారు.

కె ఆర్ ఎం బి కి అప్పగించే ప్రసక్తే లేదు :

కృష్ణాజిల్లాలను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో వారు కృష్ణాజిల్లాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. 2023 డిసెంబరు 1వ తేదీన కృష్ణా జలాలను కేర్ ఎంబీ కి అప్పగించితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్మిత సబర్వాల్ ద్వారా కేసీఆర్ రాశారని రేవంత్ రెడ్డి లేఖ ప్రతులను అసెంబ్లీలో చూపారు.

ALSO READ : నల్లగొండ : బీఆర్ఎస్ సభకు దీటుగా కేసిఆర్ అన్యాయాలపై ఎల్ఈడి స్క్రీన్ ప్రదర్శన ఎప్పుడంటే..!

కెసిఆర్ ఎందుకు రారు:

తెలంగాణకు అతి ముఖ్యమైన కృష్ణ జలాల పై సభలో చర్చ సాగుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభలోకి ఎందుకు రాడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జలాలను ఆంధ్రకు దోచిపెట్టి అన్యాయం చేసిన కేసీఆర్ సభలోకి ఎందుకు రావట్లేదని నిలదీశారు. కెసిఆర్ సభలోకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని పేర్కొన్నారు. కృష్ణా జలాల పైన తెలంగాణ జీవనాధారం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారని ఆయన కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఫామ్ హౌస్ లో దాక్కున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.

ALSO READ : కృష్ణా జలాలు కెఆర్ఎంబీ కి అప్పగించే ప్రసక్తే లేదు.. కెసిఆర్ ఎక్కడ దాక్కున్నాడు, సభలోకి ఎందుకు రాడు.. రేవంత్..!

మామను మించిన అల్లుడు :

అబద్ధాలు చెప్పడంలో మామ కేసీఆర్ను మించిన అల్లుడుగా హరీష్ రావు ఉన్నాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో నల్లగొండకు తీరని అన్యాయం చేసి నల్లగొండలో పోరు సభ అంటూ పెట్టడం సిగ్గుచేటు అన్నారు. అసెంబ్లీ నడుస్తుంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభకు రాకుండా నల్లగొండ పోరు సభకు ప్రజలను తీసుకురావడానికి బతిమిలాడుతున్నాడని అన్నారు.

ALSO READ : BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!