Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

Temple of cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి.. భూమి పూజకు సిద్ధం..!

Temple of cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి.. భూమి పూజకు సిద్ధం..!

మన సాక్షి : తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో గుడి నిర్మించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఈ గుడిని నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వానిపాకలలో నిర్మించనున్నారు. ఈ నెల 19వ తేదీన గుడి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ ప్రకటించారు. ఈ దేవాలయం నిర్మాణం కాంగ్రెస్ పార్టీ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

దేవుడిలా తమ కోరికలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని, కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని… అందువల్లనే గుడి నిర్మించబోతున్నట్లు తెలిపారు. పేద ప్రజల బాగోగులు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ దేవుడని, అలాంటి కారణజన్ముడికి గుడి కట్టడం తమ అదృష్టమని ఆయన చెప్పారు. దేవాలయ భూమి పూజ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

గతంలో అనేకమందికి దేవాలయాలు :

గతంలో సినీ తారలనే దేవుడిగా భావించే అభిమానులు ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో రాజకీయ నాయకులను కూడా దేవుడిగా భావించి దేవాలయాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏఐసీసీ సీనియర్ నేత సోనియా గాంధీ , మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, ఎన్టీఆర్ తో పాటు కేసీఆర్ కు సైతం అభిమానులు దేవాలయాలు నిర్మించి పూజలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కి సైతం గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం ప్రకటన చేయడం హాట్ హాట్ గా మారింది.

రేవంత్ రెడ్డికి పెరుగుతున్న క్రేజ్ : 

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రోజురోజుకు ఆయనకు క్రేజ్ పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం లో ఆయన ఎంతో కృషిచేసి న విషయం తెలిసిందే. అంతే కాకుండా పరిపాలనలో కూడా రేవంత్ రెడ్డి మార్క్ ఉండేలా పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పేద వర్గాల అభ్యున్నతికి కృషి చేసేందుకు రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో క్రేజ్ పెరుగుతుంది.

ALSO READ : Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

మరిన్ని వార్తలు