Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజయశంకర్ భూపాలపల్లి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Medigadda : మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత..!

Medigadda : మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత..!

జయశంకర్ భూపాలపల్లి, మన సాక్షి :

కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమం పేరుతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. కాగా ప్రాజెక్టు లోపలికి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను అక్కడి పోలీసులు అనుమతించలేదు.

దాంతో ఉద్విత పరిస్థితి చోటుచేసుకుంది. ప్రాజెక్టు వద్ద మెయిన్ గేటు మూసివేసి కార్యకర్తలను బ్రిడ్జి మీదకి వెళ్ళనివ్వలేదు. కాగా లోపలికి వెళ్ళనివ్వలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గేటును తోసుకొని మేడిగడ్డ బ్యారేజీ పైకి పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంలో తోపులాట జరిగింది.

తోపులాటలో ఓ ఎస్ డి కి గాయాలయ్యాయి. అంతేకాకుండా కిందపడిన మహిళ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. దాంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ బ్యారేజ్ పైకి పరిగెత్తారు. ఈ సందర్భంలో బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ALSO READ : Big Breaking : బీఆర్ఎస్ చలో మేడిగడ్డలో ఊహించని ఘటన.. ఒక్కసారిగా భయపడ్డ ఎమ్మెల్యేలు..!

మరిన్ని వార్తలు