Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
District collector : భవన నిర్మాణంలో నాణ్యత పాటించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : భవన నిర్మాణంలో నాణ్యత పాటించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. రూ.5 కోట్ల నిధులతో జిల్లా కేంద్ర సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల నూతన కలెక్టరేట్ సముదాయం వెనక వైపు స్థలంలో జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గురువారం స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్ తో కలిసి కలెక్టర్ సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
నిర్ణీత సమయంలోపు నిర్మాణ పనులను పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ మొగులప్ప, అడిషనల్ డిఆర్డిఏ అంజయ్య, పీ ఆర్ ఈఈ హీర్యా నాయక్, ఏ. ఈ ధర్మరాజు పాల్గొన్నారు.
MOST READ :
-
Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!
-
District collector : నిబంధనలు అన్నీ ఉంటేనే లేఔట్లకు అనుమతులు.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!









