BREAKING : దామరచర్ల వైటిపిఎస్ లో రూ.1.49 కోట్ల విలువైన అల్యూమినియం షీట్ల చోరీ.. చాకచక్యంగా చేదించిన పోలీసులు..!
BREAKING : దామరచర్ల వైటిపిఎస్ లో రూ.1.49 కోట్ల విలువైన అల్యూమినియం షీట్ల చోరీ.. చాకచక్యంగా చేదించిన పోలీసులు..!
నల్లగొండ , మన సాక్షి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దామరచర్లలోని వై.టి.పి.స్ ప్రాజెక్టు లో అల్యూమినియం కు సంబంధించిన భారీ సీట్లను దొంగతనం చేశారు. నందు భారీ నిర్మాణ కార్యక్రమం జరుగుతుండగా అందుకు అవసరమైన పరికరాలను భారీ ఎత్తున వైటీపీఎస్ పరిసరాలలో నిలువ చేసి ఉంచగా, గత ఒకటిన్నర సంవత్సర కాలంగా ఇట్టి పరికరాలు భారీ ఎత్తున చోరీకి గురికావడం గమనించి అట్టి నిర్మాణ కార్యక్రమం చేపడుతున్న బీహెచ్ఈఎల్ ఇతర నిర్మాణ సంస్థలు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అట్టి విషయంలో మూడు కేసులు నమోదు చేసిన వాడపల్లి పోలీసులు విచారణ చేపట్టినా నారని ఎస్పీ చందన దీప్తి తెలిపారు.
శుక్రవారం ఆమె ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్సై రవి , వేములపల్లి ఎస్సై విజయ్ కుమార్, మాడుగులపల్లి ఎస్సై శోభన్ బాబు మరియు వాడపల్లి సిబ్బంది, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు లతో యుక్తంగా ప్రత్యేక బృందంగా ఏర్పడి గత వారం రోజులుగా విచారణ జరిపి ఇటి మూడు కేసులను ఛేదించి ఈ క్రింది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
షేక్ మహమ్మద్, షేక్ మునీర్, (ఎన్ ఎస్ పి కాంప్, మిర్యాలగూడ పట్టణం) , కంబాల అశోక్, (ఇరికిగూడెం గ్రామం దామరచర్ల మండలం), షేక్ రజాక్ (నివాసం తాళ్లగడ్డ , మిర్యాలగూడ పట్టణం), మహమ్మద్ అప్రోజు ( వాడపల్లి గ్రామం దామరచర్ల మండలం), .మహమ్మద్ జానీ (శాంతినగర్ మిర్యాలగూడ పట్టణం), మంద శ్రీను ( వీర్లపాలెం గ్రామం, దామరచర్ల మండలం.) మంద మహేష్, ( గాంధీ నగర్ గర్ల్స్ హై స్కూల్ దగ్గర, మిర్యాలగూడ పట్టణం.), మందా నాగేంద్రబాబు, (వీర్లపాలెం గ్రామము దామరచర్ల మండలం.), అమిత్ కుమార్ భరద్వాజ్, (నిజాముద్దీన్ పుర గ్రామం, మౌనత్ భంజన్ , మావు డిస్ట్రిక్ట్, ఉత్తర ప్రదేశ్.),. రవీంద్ర ప్రసాద్, ( కొరావులి గ్రామాము, సత్వర బ్లాక్, బలియా జిల్లా, ఉత్తర ప్రదేశ్).లు ఉన్నారు.
ప్రస్తుత సమాచారం మేరకు నిందితులు మిర్యాలగూడ చెందిన మహమ్మద్, మునీర్, అశోక్, మహేష్, జానీ మరియు రజాక్ లు ఒక ముఠాగా ఏర్పడి, దామరచర్లకు చెందిన ఆఫ్రోజ్, నాగేంద్రబాబు, శ్రీనులతో కలిసి వై.టి.పి.ఎస్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్ లు రవి, రాంబాబు , యాకూబ్, యూపీ కి చెందిన సూపర్వైజర్ రంజిత్ , క్రేన్ ఆపరేటర్ రవీందర్ ల సహకారంతో సదరు ఈ నేరంలో భాగస్తులైన సెక్యూరిటీ గార్డులు విధులలో ఉన్న సమయంలో వై.టి.పి.ఎస్ ఆవరణలోకి డీ.సీ.ఎం వాహనము పంపి, క్రేన్ ఆపరేటర్ సహాయంతో పరికరాలను దొంగిలించి వాటిని హైదరాబాదు లోని ముషీరాబాద్ కు చెందిన షర్ఫోద్దీన్ కు విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకున్నారు.
ఇట్టి కేసులలో విచారణ ఇంకా కొనసాగుతున్నందున నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచి పోలీస్ కస్టడీ ద్వారా తదుపరి విచారణ చేపట్టబడును. ఇంకా ఎవరెవరు నిందితులు భాగస్వాములుగా ఉన్నారో విచారణ చేయవలసి ఉన్నదని ఎస్పీ తెలిపారు.
కేసును ఛేదించిన మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్సై రవి , వేములపల్లి ఎస్సై విజయ్ కుమార్, మాడుగులపల్లి ఎస్సై శోభన్ బాబు మరియు వాడపల్లి సిబ్బంది, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు లను జిల్లా ఎస్పీ శ్రీమతి చందనా దీప్తి ప్రత్యేకంగా అభినందించారు.
ALSO READ :
Nalgonda : నల్గొండ జిల్లాలో ముగ్గురు తహసిల్దార్లు, ఒక విఆర్ఓ అరెస్ట్..?
Miryalaguda : మిర్యాలగూడలో వాట్సప్ స్టేటస్ పెట్టి.. రైలు కింద పడి యువకుడు మృతి..!










