అల్లుడిని చంపిన పిల్లనిచ్చిన మామ..!

పిల్లనిచ్చిన మామే అల్లుడిని కొట్టి చంపిన సంఘటన వరంగల్ జిల్లా రంగసాయిపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అల్లుడు శ్రీనివాస్ ఆవారాగా తిరుగుతున్నాడు.

అల్లుడిని చంపిన పిల్లనిచ్చిన మామ..!

మన సాక్షి డెస్క్ :

పిల్లనిచ్చిన మామే అల్లుడిని కొట్టి చంపిన సంఘటన వరంగల్ జిల్లా రంగసాయిపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అల్లుడు శ్రీనివాస్ ఆవారాగా తిరుగుతున్నాడు. కొట్లాటలు, బెదిరింపులతో ఆవారాగా తిరగటం వల్ల అతనిపై రౌడీషీట్ కేసు కూడా ఉంది. అంతేకాకుండా భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ విషయంతో మామతో విభేదాలు చోటు చేసుకున్నాయి.

కూతురు కాపురం చక్కదిగేందుకు ఎన్నో రోజులుగా మామ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా కూడా అల్లుడి విషయంలో ఎలాంటి మార్పు రాలేదు. చివరికి అత్తమామల కూడా నరకం చూపిస్తున్నాడు. ఫిబ్రవరి 13వ తేదీన అల్లుడు ఇంటికి వచ్చాడు.

ALSO READ : Telangana : శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. అధికార పక్ష సభ్యుల విచిత్ర కామెంట్..!

భార్యతో పాటు అత్తమామలతో కూడా గొడవలకు దిగాడు. కొన్ని సంవత్సరాలుగా అల్లుడి వేధింపులను భరిస్తున్న మామ సహనం కోల్పోయాడు. అల్లుడు పై దాడి చేశాడు. కర్ర రాడ్డుతో అల్లుడిని కొట్టాడు. దాంతో అల్లుడు శ్రీనివాస్ చనిపోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మామను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. వేధింపులు తట్టుకోలేకనే గొడవపడ్డామని ఈ గొడవలో చనిపోయినట్లు మామ చెబుతున్నాడు.

ALSO READ : కెసిఆర్ ఆఖరి అస్త్రం.. నల్లగొండలో సెంటిమెంటు రగిలించే ప్రయత్నమేనా..?