Miryalaguda : లిఫ్టుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!
Miryalaguda : లిఫ్టుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!
అడవిదేవులపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేసి రైతులకు సాగు త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. అడవిదేవులపల్లి మండలంలో నిర్మాణం జరుగుతున్న దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను శనివారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశించారు. కాంట్రాక్టర్లు పనిని పదేపదే వాయిదా వేయకుండా పనిని త్వరగా పూర్తిచేయాలనన్నారు.

అదేవిధంగా వారికి నిధుల కొరత లేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి యొక్క సహకారంతో రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, మండల పార్టీ అధ్యక్షులు రామావత్ బాలు నాయక్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దశరథ నాయక్, చిట్యాల గ్రామ ప్రజలు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
MOST READ :
-
CM Revanth Reddy : రైతు పండుగ వేదికగా రైతులకు శుభవార్త.. స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్..!
-
Viral Video : తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏం చెప్తుందో వినండి.. (వీడియో)
-
KTR : కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్.. సంచలన ట్వీట్..!
-
TG News : ఎకరానికి 20 లక్షల పరిహారం, ఉద్యోగం.. సీఎం సంచలన ప్రకటన..!









