వేములపల్లి : దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!
వేములపల్లి : దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!
వేములపల్లి, మన సాక్షి :
నగలు,నగదు దొంగతనం చేసిన దొంగ గొట్టిపర్తి నర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు వేములపల్లి ఎస్సై డి. విజయ్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని ఆమనగల్ గ్రామంలో ఆగస్టు 24 వ తేదీన గొట్టిపర్తి ఎల్లమ్మ భర్త వెంకన్న ఇంటికి తాళం వేసి పొలం దగ్గరకు వెళ్లారు.
ఇదే అదునుగా భావించిన దొంగ అదే గ్రామానికి చెందిన గొట్టిపర్తి నరసయ్య తాళం పగలకొట్టి ఇంటిలోకి వెళ్లి బీరువాలో ఉన్న చిన్న బంగారు బిల్లా ఒక జత కాళ్ల పట్టీలు, మెట్టెలు మరియు కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో 25వ తారీఖున ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన ఎస్సై 28 తారీకు న సోమవారం ఉదయం 8 గంటలకు శెట్టిపాలెం ఎక్స్ రోడ్డు వద్ద గొట్టిపర్తి నరసయ్య వయసు 36 సం.. కులం కుమ్మరి వృత్తి ప్లంబర్ పని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని నుంచి నగలు, నగదు స్వాధీనంచేసుకొని అతడిని సోమవారం రిమాండ్ కు తరలించారు.
ALSO READ :
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!









