Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ
పుష్ప పల్లకిలో తిరుపతి గంగమ్మ ఊరేగింపు..!
పుష్ప పల్లకిలో తిరుపతి గంగమ్మ ఊరేగింపు..!
రామసముద్రం, మనసాక్షి :
అంద్రప్రదేశ్ లోని రామసముద్రం మండలం మూగవాడి గ్రామ పంచాయతీ ఎం. కొత్తూరు గ్రామంలో మంగళవారం రాత్రి తిరుపతి గంగమ్మ తిరుణాళ్ళు అత్యంత వైభవం గా నిర్వహించారు. వేడుకలలో భాగంగా అమ్మ వారిని కార్య నిర్వాహకులు, ఆలయ పూజారులు అందంగా ముస్తాబు చేసి, పుష్ప పల్లకిలో పురవీధుల గుండా అమ్మ వారిని ఊరేగింపు చేశారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో విద్యుత్ దీపాలంకరణతో మిరమిట్లు కొలుపే కాంతులతో అందంగా అలంకరించారు. పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకుని అమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఎస్సై రవికుమార్ పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు నిర్వాహకులు గ్రామస్తులు పాల్గొన్నారు.









