పాడే మోస్తూ.. ముగ్గురు మృతి

పాడే మోస్తూ.. ముగ్గురు మృతి

మనసాక్షి , రాయలసీమ బ్యూరో :

ప్రస్తుత పరిస్థితుల్లో మరణం ఎవరిని పలకరిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఎంతోమంది గుండెపోటుతో చిన్నవయసులోనే మృతి చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొన్నది.

 

చనిపోయిన వ్యక్తి మృతి దేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్తుండగా పాడే పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన తో చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొన్నది.

వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా లో అంత్యక్రియలో పాల్గొన్న వారు విద్యుత్ షాక్ గురయ్యారు. కుప్పం మండలం తంబిగాని పల్లెకు చెందిన రాణి అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తుండగా స్మశాన వాటికకు దగ్గరకు చేరుకున్నారు.

 

అక్కడ విద్యుత్ వైర్లు వేలాడుతుండగా తీగ పాడే కు తగిలింది . దాంతో పాడే మోస్తున్న తిరుపతి , రవీంద్ర మనప్పలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇