మూడు నెలలుగా మృత్యువుతో పొరాడి … చివరికి
మిర్యాలగూడ, మనసాక్షి:
మూడు నెలలుగా మృత్యువుతో పొరాడి … చివరికి ప్రాణాలు వదిలాడు ఓ యువకుడు, వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామం రెడ్డిల్యాబ్ సమీపంలో ఫిబ్రవరి 20 వ తేదీన జరిగిన కారు బైక్ ఢీకొన్న ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో మిర్యాలగూడ మండలం పచ్చారుగడ్డ కు చెందిన నేతినురి శ్రవణ్ (24) కు తీవ్రమైన గాయాలు కావడంతో మిర్యాలగూడ పట్టణంలోని శ్రీబాలజీ నర్సింగ్ హోం కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రవణ్ ఆరోగ్యం విషమించడంతో శనివారం ఉదయం 5:30 లకు మృతి చెందడం జరిగింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించినట్లు మాడ్గులపల్లి ఎస్సై కంచర్ల బాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
1. నాన్న కొన్న సెకండ్ హ్యాండ్ సైకిల్ చూసి మురిసిపోతున్న కొడుకు (వీడియో )
2. చిన్న వయసులోనే సైబర్ క్రైమ్ లో రాణిస్తున్న పశ్య భరత్ రెడ్డి
3. BIG BREAKING : ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ









