Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలు

Vemulapally : అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు..!

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు.

Vemulapally : అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు..!

వేములపల్లి, మన సాక్షి:

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రధమ బహుమతి రూ:10116, ద్వితీయ బహుమతి రూ:7116, తృతీయ బహుమతి రూ:5116, చతుర్ధ బహుమతి రూ:3116, పంచమ బహుమతి రూ:1116 రూపాయలతో బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు.

అనంతరం మహిళా కోలాటం ప్రదర్శనలు జరగనున్నట్టు తెలిపారు. కావున గ్రామ మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, ఉప సర్పంచ్ పల్లా గోవర్ధన్, మాజీ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ తరి సైదులు, వార్డు సభ్యురాలు పసుల శైలజ, గ్రామ పెద్దలు మొండికత్తి కిరణ్ కుమార్, ఇంద్రపల్లి సతీష్, శీలం జగన్, బోర వెంకన్న, తరికోప్పుల పవన్, సాయి కుమార్,సతీష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

MOST READ NEWS : 

  1. Nalgonda : బెట్టింగులకు అలవాటు పడి.. చివరికి అలా మారాడు..!

  2. Suryapet : వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం కీలకం.. ధూపహాడ్‌లో అవగాహన కార్యక్రమం..!

  3. 200 కుటుంబాలకు ఇబ్బంది.. శంకర్పల్లికి చౌక ధరల దుకాణం ఏర్పాటు చేయాలని డిమాండ్..!

  4. TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

  5. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు