తుంగతుర్తి టికెట్ నాకు ఇస్తే గెలుపు నాదే – మందుల సామెల్

తుంగతుర్తి టికెట్ నాకు ఇస్తే గెలుపు నాదే – మందుల సామెల్

తుంగతుర్తి , మన సాక్షి

రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ టికెట్​ నాకు ఇస్తే గెలుపు నాదేనని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్​ మందుల సామేల్​ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

 

నాటి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి నేటి బీఆర్ఎస్ లో చురుకైన పాత్ర పోషిస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పనిని పూర్తి చేశాననన్నారు. తెలంగాణ ఉద్యమంలో 2004 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమ నేత కెసిఆర్ వెంట నడిచానని తెలియజేస్తూ తనపై నమ్మకంతో రెండుసార్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించారని అన్నారు.

 

ALSO READ : Inter : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు… ట్రైనింగ్ లోనే నెలకు రూ. 25 వేల వేతనం..!

 

వచ్చే ఎన్నికల్లో స్థానిక వ్యక్తినైన నేను 60 వేల ఓట్లు ఉన్న మాదిగల బిడ్డగా వారి ప్రతినిధిగా నాకు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలిచి కెసిఆర్ కు బహుమతిగా ఇస్తానని అన్నారు. అనంతరం తనతో నాటీ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన పలువురిని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శాలువాతో ఘనంగా సత్కరించారు.

 

ఈ సమావేశంలో కేతిరెడ్డి రమేష్ రెడ్డి, అడ్డగూడూరు మాజీ సర్పంచ్ కూరాకుల యాదగిరి, చిప్పలపల్లి రాములు, గొట్టిపర్తి మాజీ ఎంపిటిసి కండే ఎల్లయ్య, రాజు, శ్రీను,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇