శేరిలింగంపల్లి : టిఫిన్ బైఠక్ విజయవంతం

శేరిలింగంపల్లి : టిఫిన్ బైఠక్ విజయవంతం

శేరిలింగంపల్లి : మన సాక్షి :

గజ్జల యోగానంద్ బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిఫిన్ బైఠక్ ను శేరిలింగంపల్లి

అసెంబ్లీ లో బుధవారం స్థానిక గచ్చిబౌలి డివిజన్ గుల్ మొహర్ కాలని పార్క్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ ప్రజలకు మరింత సేవ చేసేలా ప్రోత్సాహం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, పార్టీ పటిష్టత తదితర అంశాలపైనా ‘టిఫిన్’ భేటీల్లో చర్చించడం ద్వారా పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ నాయకులు పెద్ద సంఖ్య లో టిఫిన్ బైఠక్ లో పాల్గొనడం కార్యకర్తల నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్ధికి తార్కాణమని, బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి కి, రాబోయే మార్పుకు మార్గం సుగమం చేస్తున్నారని యోగానంద్ తెలియచేసారు.

 

ALSO READ : 

1. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

2. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

3. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

 

 

త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపద్యంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు యోగానంద్ పేర్కొన్నారు. ప్రతి డివిజన్ నుండి బూత్ మరియు ఆ పై స్థాయి నాయకులతో పరిచయ కార్యక్రమాల అనంతరం ఎవరికీ వారు వారి ఇంటి నుండి తెచ్చుకున్న అల్పాహారాన్ని ఒకరికి ఒకరు పంచుకుంటూ..

 

తన మన చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి మెలిసి ఇలా ఒకే చోట కలవడం ఎంతో ఆనందంగా ఉంది అని, బీజేపీ పార్టీ బలోపేతం కోసం ఎలా పని చేయాలి, ప్రజల తరుపున ఎలా పోరాడాలి అని ఈ సమావేశంలో ఒకరికి ఒకరు తమ అభిప్రాయాలను పంచుకోవడం వలన పార్టీ బలోపేతానికి అవి ఎంతో ఉపయోగ పడతాయని యోగానంద్ తెలియజేశారు.

 

ALSO READ :

1. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

3. Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!

 

ఒక పార్టీ సమావేశం నిర్వహించాలంటే వేలకు వేలు ఖర్చు చేసి, మద్యం పంచి మందిని పోగుచేసే విధానం భారతీయ జనతా పార్టీ ది కాదని, స్వచ్చందంగా పార్టీ కోసం అను నిత్యం పని చేసే కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ నే అని యోగానంద్ తెలియజేయారుఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ నాయకులు, శక్తి కేంద్ర ఇంఛార్జిలు, బూత్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.