Holiday : రేపు విద్యాసంస్థలకు సెలవు ఎందుకంటే..!

మేడారం సమ్మక్క ,సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Holiday : రేపు విద్యాసంస్థలకు సెలవు ఎందుకంటే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

మేడారం సమ్మక్క ,సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు శుభవార్త తెలియజేసింది. రేపు అనగా ఫిబ్రవరి 23వ తేదీన విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కానీ ఈ సెలవు రాష్ట్రవ్యాప్తంగా మాత్రం కాదు.

కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యాసంస్థలకు మాత్రమే వర్తించనున్నది. దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థలు, స్కూలు, కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుంది. కాగా ములుగు జిల్లాలో మేడారం జాతర జరుగుతున్న నాలుగు రోజులపాటు అనగా 21, 22, 23, 24వ తేదీ వరకు కూడా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ALSO READ : Young man halchal : నెంబర్ ప్లేట్ లేని వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకుని హల్చల్ చేసిన యువకుడు