Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – ట్రాఫిక్ సిఐ విజయ్ కుమార్.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – ట్రాఫిక్ సిఐ విజయ్ కుమార్.

చౌటుప్పల్. మన సాక్షి :

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ సిఐ విజయకుమార్ అన్నారు. స్థానిక చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా జి.ఎం.ఆర్ సంస్థ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చౌటుప్పల్ లోని డ్రైవర్ లందరికీ ఉచిత కంటి వైద్య శిబిరమును ట్రాఫిక్ సిఐ విజయ్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించి, రోడ్డు భద్రత అవగాహన ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ.. డ్రైవర్లు రోడ్డు మీద తమ వాహనాలను వ్యతిరేక దిశలో నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. వాహనాన్ని నడిపే డ్రైవర్లు కంటి చూపుపై అశ్రద్ధ చూపవద్దని దగ్గరచూపు, దూరపుచూపు లోపాలు ఉంటే కంటి వైద్యులను సంప్రదించి చూపించుకోవాలని కోరారు. డ్రైవర్లకు కంటిచూపు బాగా ఉంటేనే ప్రయాణికులను వారి గమ్యాలకు సురక్షితంగా చేర్చి, మీరు కూడా మీ కుటుంబాన్ని కలుసుకొని సంతోషంగా ఉంటారని తెలిపారు. డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని హెచ్చరించారు.

 

మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని వారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే శిక్ష తప్పదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు .రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం 20 నుంచి 30 సంవత్సరాల లోపు వారే అధిక శాతం మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే చట్టరీత్యా శిక్షలు తప్పవని హెచ్చరించారు. నిరంతరం జాతీయ రహదారిపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం,అతివేగం తగదని, వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరాలన్నారు.

 

బైక్ లపై వెళ్లేటప్పుడు హెల్మెట్, కారులో సీల్డ్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. ఈ సందర్భంగా కంటిచూపు పరీక్షలు చేయించుకున్న డ్రైవర్లు అందరికీ ఉచిత మందులు, కళ్లద్దాలు ట్రాఫిక్ సిఐ విజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ సిబ్బంది రాజేందర్, మేనేజర్ జి శ్రీనివాస్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ సంతోష్, రామకృష్ణ, సాంబశివరావు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు