ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సెక్టార్ అధికారులకు శిక్షణ..!

అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర అతి ముఖ్యమైనదని, అప్రమత్తంగా ఉంటూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఈవిఎం లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సెక్టార్ అధికారులకు శిక్షణ..!

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర అతి ముఖ్యమైనదని, అప్రమత్తంగా ఉంటూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఈవిఎం లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్లచే సెక్టార్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ మయాంకుమిత్తల్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని, సెక్టార్ అధికారి తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, ఈవీఎం, వి వి ప్యాట్లు, హ్యాండ్ బుక్, పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి వి ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశాన్ని తెలుసుకొని ఉండాలని తెలిపారు.

ALSO READ : Congress Big Plan : కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కెసిఆర్, కేటీఆర్ పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఎవరెవరు ఎక్కడంటే..?

ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చేసి సిబ్బందికి ఎన్నికల రోజున తగు సూచనలు అందించాలని తెలిపారు. ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామాగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు, ఎన్నికల రోజున తమకు కేటాయించిన రూట్ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తహసిల్దార్లు, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ఈవీఎంలలో సమస్య తలెత్తితే రిజర్వు ఈవీఎంలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే శిక్షకులచే నివృత్తి చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు కృషి చేయాలని తెలిపారు. సెక్టోరియల్ అధికారులు అన్ని సామాగ్రినీ సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుందని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ స్టేషన్లో వారీగా అందజేయాలన్నారు. ఎవరి టేబుల్ దగ్గర వారే కూర్చోవాలన్నారు.

ALSO READ : కొలిక్కి రాని వామపక్షాల నియోజకవర్గాలు.. 50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు.. రెండో జాబితా విడుదలకు సిద్ధం..!

స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎం, వివిపేట్, కంట్రోల్ యూనిట్లను పోలింగ్ ఆఫీసర్లకు అందజేయాలన్నారు. స్పెషల్ కౌంటర్,జనరల్ కౌంటర్ ఉంటాయని అన్ని ఎన్నికల సామగ్రి చెక్ చేసుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకు మాకు పోలింగ్ నిర్వహించి అనంతరం ప్రిసైడింగ్ అధికారి సంతకం తీసుకోవాలన్నారు. మేల్, ఫిమేల్ శాతం ఎంత ఉందో చెప్పాలన్నారు. ఫామ్ 17ఏ క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు.

17 సి జాగ్రత్తగా పరిశీలించి ప్రతి సెక్టోరియల్ అధికారి ఫోన్ ఆన్ లో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ గోపాల్ నాయక్, డిబిసిడిఓ కృష్ణమాచారీ,,ఏ. ఓ. జాన్ సుధాకర్,సెక్టోరియల్, మాస్టర్ ట్రైనర్లు, సెక్టార్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!