మిర్యాలగూడ : దొంగతనం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.సీఐ నరసింహారావు తెలిపారు.

మిర్యాలగూడ : దొంగతనం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

సిఐ నరసింహారావు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.సీఐ నరసింహారావు తెలిపారు. వివరాల ప్రకారం…ఆర్. శ్రీను (26) గేదవల్లి గ్రామం కనగల్ మండలం నల్గొండ జిల్లా.ఏ సంజీవరెడ్డి కొర్రపాడు గ్రామం కడప జిల్లా ఇద్దరు వ్యక్తులు చెడు అలవాట్లు బానిసఐ సిగరెట్, మందు త్రాగే అలవాటు కలదు.వీరు జులాయిగా తిరుగుతుంటారు.

వీరికి ఎటువంటి సంపాదన లేదు. కావున ఇద్దరు కలిసి వారి యొక్క చెడు విలాసాలను తీర్చుకోవడానికి ఏదైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకొని మిర్యాలగూడ పట్టణంలో 2024 ఫిబ్రవరి ఆరో తారీకు రాత్రి 09 గంటల సమయంలో దొంగలు మిర్యాలగూడలో ఉన్న అశోక్ నగర్ ఏరియాలో ఒక ఇంట్లో మొదటి అంతస్తుకి వెళ్ళి వారితో తెచ్చుకున్న చిన్న ఇనుపరాడ్డు సహాయంతో పగులగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువను పగులగొట్టి అందులో ఉన్న ఒక నల్లపూసల హారం,రెండు చెవి దుద్దులు మరియు కొంత నగదును దొంగలించారని తెలిపారు.

ALSO READ : BIG REAKING : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!

అదే రోజు మరొక బజార్లో ఒక ఇంటి ముందు బజాజ్ ప్లాటినా బైక్ టీఎస్ 05 ఎఫ్ కె 5597 నెంబర్ గల బైక్ ను దొంగతనం చేసి వెళ్ళినారు.అట్టి బైక్ కు జిపిఎస్ లొకేషన్ ఉండుటవలన, దాని ద్వారా నిందుతులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో పట్టుబడి చేయడమైనది.వారి వద్ద నుండి మోటార్ సైకిల్,ఒక నల్లపూసల హారం మరియు రెండు చెవిదిద్దులు, 2 తులాలు,ఒక స్మార్ట్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

గతంలో రుద్రాక్ష శ్రీను పైన వివిధ పోలీస్ స్టేషన్ లలో 40 కేసులు ఉన్నాయి. కొన్ని కేసులలో శిక్ష కూడా అనుభవించినాడు. ఇతడు చర్లపల్లి జైల్ నుండి 2024 ఫిబ్రవరి ఒకటో తారీఖున రీలీజ్ అయి వచ్చినాడు. ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ పంపించడం జరిగిందన్నారు. ఈ కేసును చేదించిన మిర్యాలగూడ టు టౌన్ సీఐ నరసింహ రావు ఆధ్వర్యంలో ఎస్సైలు ఎస్. కృష్ణయ్య, బి.రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ పి.వెంకటేశ్వర్లు, పి.సిలు రవి, అనిల్, నరేష్,ఎం.రామకృష్ణ లను మిర్యాలగూడ సిఐ అభినందించారు.

ALSO READ : గ్రూప్-1 అభ్యర్థులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..!