Murder case : హత్య కేసులో నిందితుల అరెస్ట్

హత్య కేసులో నిందితుల అరెస్ట్

రాజన్న సిరిసిల్ల ప్రతినిథి, మన సాక్షీ:

మండలంలోని దాచారం గ్రామానికి చెందిన దరిపల్లి శంకర్ హత్య కేసులో ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ తెలిపారు.

 

మంగళవారం సిరిసిల్ల రూరల్ కార్యాలయంలో హత్య కేసుకు సంబంధించి ఎస్ఐ రాజేశ్ తో కలిసి సీఐ ఉపేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం..

 

ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన దరిపల్లి శంకర్ కు సిద్దిపేట మండలానికి చెందిన దరిపల్లి చంద్రకళతొ 27సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరి కూతుళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి.

 

Also Read : Phonepe : ఫోన్ పే వాడుతున్నారా…? అయితే మీకు ఓ గుడ్ న్యూస్..!

 

ఈ మధ్యనే రెండవ కూతురు వివాహం జరిగింది. శంకర్ రెండు ఎకరాల భూమి విక్రయిస్తే రూ.46లక్షలు వచ్చాయని కూతురు పెళ్లి చేయగ మిగితా డబ్బుల విషయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది.

 

ఆదివారం రాత్రి తండ్రి , కొడుకులు శంకర్, వంశీ కృష్ణ ల మధ్య డబ్బుల విషయం గొడవ జరిగిన నేపథ్యంలో శంకర్ మధ్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో భార్య చంద్రకళ, కుమారుడు వంశీ కృష్ణ ఇద్దరు కలిసి శంకర్ పొట్టపై కత్తితో పొడిచి. గొంతు నమలడంతో శంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు.

 

మృతుడి సోదరీ సుగుణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కుటుంబ కలహాలు, అస్థి కొసం హత్య చేసినట్లు నేరస్థులు ఒప్పుకున్నారు.

 

నేరస్థులు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం పరచుకొని నేరస్థులను కోర్టులోహజరు పరిచినట్లు సీఐ తెలిపారు.