Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : రెండుసార్లు ఓకే బ్రిడ్జి నిర్మాణం, ప్రజాధనం దోపిడి

మిర్యాలగూడ : రెండుసార్లు ఓకే బ్రిడ్జి నిర్మాణం, ప్రజాధనం దోపిడి

మిర్యాలగూడ , మన సాక్షి

నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణం లో ఒకే బ్రిడ్జి నిర్మాణానికి రెండు పర్యాయాలు నిధులు మంజూరు చేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భక్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు.

 

మిర్యాలగూడ పట్టణంలోని 38, 36వ వార్డు ఎరకల బజారు నాలాపై బ్రిడ్జిని 2012లో మున్సిపల్ నిధులతో వంతెన ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశారు. కాగా అట్టి వంతెనపై ఇప్పుడు బ్రిడ్జి నిర్మించడానికి రూ.25 లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని అన్నారు.

వార్డు ప్రజలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోడి రెక్క శౌరి , కోడి రెక్క ఇంద్ర కుమార్ ఆరోపణల మేరకు కాంగ్రెస్ కౌన్సిలర్లు, నేతలతో కలిసి శనివారం ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు మూడు లక్షలతో వంతెన పూర్తయ్యే అవకాశం ఉండగా గతంలో చేసిన పనులకు సైతం ఎస్టిమేట్ వేసి వంతెన నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి ప్రజాధనాన్ని కాంట్రాక్టుల పేరా దోచుకునేందుకు అధికార నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు .

 

38వ వార్డు కాంగ్రెస్ నాయకులు వంతెన నిర్మాణ వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినప్పటికీ స్పందించకపోగా తక్షణమే 8 రోజుల్లో వంతెన పనులు పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ ని మున్సిపల్ కమిషనర్ ఆదేశించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

 

మున్సిపల్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులోనే ఇలాంటి కార్యక్రమాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. మొత్తం వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి వంతెన నిర్మాణం తగ్గించి పూర్తి చేసే విధంగా చూడాలని ఆయన కోరారు.

 

ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకురి బాలు, నాగు నాయక్ కౌన్సిలర్లు జానీ పాష , గుంజ శ్రీను, లావురి రవి నాయక్ , మౌయిజ్ , బ్లాక్ కాంగ్రెస్ తమ్మడబోయిన అర్జున్ , పొలగాని వెంకటేష్ గౌడ్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సిద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు