ద్విచక్ర వాహనం అదుపు తప్పి మహిళా కానిస్టేబుల్ మృతి
ద్విచక్ర వాహనం అదుపు తప్పి మహిళా కానిస్టేబుల్ మృతి
జగిత్యాల ప్రతినిధి,(మన సాక్షి)
జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 2018 బ్యాచ్ కి చెందిన మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ సోమవారం విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మల్యాల సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి.
వెంటనే ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి ప్రమాదానికి గల కారణం అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. అనతరం వేద శ్రీ భౌతిక కాయానికి జిల్లా ఎస్పి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు వేద శ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
వేద శ్రీ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నివాళులు అర్పించిన వారిలో ఎస్బి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు, మల్యాల సి.ఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.









