Unexpected Rain : అకాల వర్షానికి ఆగమైన అన్నదాత
అకాల వర్షానికి ఆగమైన అన్నదాత
వలిగొండ , మన సాక్షి:
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షానికి రైతు యొక్క బాధ వర్ణనాతీతంగా మారింది. ఈ అనుకోని వర్షం కారణంగా ఆరుగాలం పండించిన పంట కోత కోసి కుప్పనూర్చి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే అక్కడ ఈ అకాల వర్షం వల్ల ఈ ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.
ఈ వర్షం కారణంగా రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడో ఏ టైం చెప్పకుండా వచ్చే ఈ వర్షానికి రైతుకి చెప్పలేనంతగా దెబ్బ తగిలింది. దీనికి కారణం ప్రభుత్వం గా భావిస్తూ ఒక 15 రోజులు ముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని ఒక రైతు మన సాక్షితో వాపోయారు.
రైతులకు సకాలంలో పట్టాలు అందించి ఉంటే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీనికి కొన్ని ప్రజా సంఘాలు కూడా తన మద్దతును తెలుపుతున్నాయి.









