సేంద్రీయ సాగులో ఉద్యాన పంటలు, లోకసానికి వనమాలి అవార్డు

సేంద్రీయ సాగులో ఉద్యాన పంటలు, లోకసానికి వనమాలి అవార్డు

ఉద్యాన పంటలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం

దేవరకొండ, (నల్గొండ), మనసాక్షి ప్రతినిధి :  సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఉద్యాన పంటలను పండిస్తూ, వ్యవసాయంలోను.. నూతన పద్ధతులను తీసుకవస్తూ నేటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న లోకసాని పద్మా రెడ్డి కి వనమాలి అవార్డు లభించింది.  తెలంగాణ ప్రజాకవి జయరాజు, ఉస్మానియా తెలుగు ప్రొఫెసర్ హుస్సేన్ యూనివర్సిటీ చైర్మన్ కోటేశ్వరరావు చేతుల మీదుగా వనమాలి అవార్డు ను  తెలంగాణ తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళాతోరణం లో అవార్డును అందుకున్నారు.  ప్రకృతి ప్రేమికుడు నల్లగొండ జిల్లా ఉత్తమ రైతు వనమాలి లోకసాని పద్మా రెడ్డి తన సహజసిద్ధమైన ప్రకృతి ఉద్యాన వ్యవసాయానికి గాను “వనమాలి” అనే బిరుదుతో సత్కరిం చడం జరిగింది.

ALSO READ : కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే చేరిక – latest news

ఎవరీ లోకసాని పద్మా రెడ్డి ?

తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామ నివాసి వనమాలి లోకసాని పద్మా రెడ్డి. వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ. ఆయన ఆలోచనలకు, పరిశోదనలు మొదలుపెట్టాడు. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతి సేవ చేస్తే ముందు తరాలకు మంచి వాతావరణాన్ని మంచి భవిష్యత్తును అందించవచ్చు అని ఆయన అంటారు.

వ్యవసాయ మీద మక్కువ : 

ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన లోకసాని పద్మా రెడ్డి. తనకున్న ఫ్యాషన్, వినుతమైన ఆలోచనలను వ్యవసాయ పద్దతులు వాటిపై గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఆయన పరిశోధనలు చేశారు. అలా మొదలైన ఆయన ఆలోచనలు పరిశోధనలకే పరిశోధనలు మొదలుపెట్టాడు. వృత్తి ఏదైనా అంకితభావం, దాని వల్ల ఆసక్తి ప్రేమ ఉన్నట్లయితే ఆయా రంగలలో విజయాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని వృత్తిగా కాకుండా.. ఊపిరిగా చేసుకొని 105 ఎకరాల్లో పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలను పండిస్తున్నారు. ఎవరైనా ఏదైనా రంగంలో కొద్దికాలం ఆసక్తి చూపిస్తూ ఉండడం సహజం కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఉన్నటువంటి వ్యవసాయపై ఆసక్తి అంతకుమించి పెరిగింది.

ALSO READ : BREAKING : ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దారుణం

ఉద్యాన వనంలో సాగుచేసే పంటలు : 

తనకున్న వ్యవసాయ భూమిలో పంటల కోసం 145 బోర్డు వేసినా నీటిలభ్యత కొరత ఏర్పడింది. ఇది గ్రహించిన వనమాలి లోకసాని పద్మారెడ్డి ఇరిగేషన్ విభాగంలో పనిచేస్తున్న శ్యాం ప్రసాద్ రెడ్డి ని సంప్రదించారు. నీటి లభ్యతను కాపాడుకుంటూనే వనరులను సమకూర్చుకోవడం కోసం కందకాలను తన 109 ఎకరాలలో ఏర్పాటు చేశారు. దీంతో నీటి కొరత తీరింది . ప్రస్తుతం ఆయన వనంలో ఇది 20 ఎకరాలలో అంగుళం ఖాళీ లేకుండా పండ్ల మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా వ్యవసాయంలో ఫర్టిలైజర్స్ తో వ్యవసాయం చేసి తదనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో రోగాలు బారిన పడుతున్న ఈ ఫర్టిలైజర్స్ ను నిర్మూలించాలననే ఉద్దేశంతో సేంద్రీయ వ్యవసాయానికి బాటలు వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయ ఉద్యానవనంలో 50 ఆవులను పెంచుతూ వాటి ద్వారా వచ్చేటువంటి మలమూత్రాలను హౌస్ పంపింగ్ చేసి పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని కి శ్రీకారం చుట్టారు. 18 ఎకరాల్లో బ్రెజిల్ ఆరంజ్, న్యూ సెల్లార్ గోల్డ్, మట్ట రంగాపూర్ , జబెర బత్తాయి రకాలు, జామ, కుంకుడు, సీతాఫల్, ఉసిరి దీంతో అనేకమైన ఉద్యాన పంటలు పండిస్తున్నారు. ఆయన ఉద్యనవననికి ఇతర రాష్ట్రాల నుంచి శాస్త్రవేత్తలు, రైతులు, ఐఏఎస్ అధికారులు, వ్యవసాయ పరిశోధన నిమ్మితం విద్యార్థులు, ప్రొఫెసర్ లు వస్తుంటారు.

ALSO READ : దళితుల పట్ల ప్రేమ చూపించే ఏకైక సీఎం కేసీఆర్ – నామా నాగేశ్వరరావు

ఆయన జీవితం ప్రకృతికె అంకితం : 

డబ్బు అనేది ఆశాశ్వతమని శాశ్వతం కాదని నాటిన మొక్కలు ఎన్నో తరాల వరకు అందరికీ ఫలాలతో పాటు మంచి ఆక్సిజన్ ఇస్తూ సమృద్ధిగా వర్షాలని కురిపిస్తాయని లోకసాని పద్మారెడ్డి తెలిపారు. మొక్కలపై మక్కువ ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులతో పాటు ఆర్ధికంగా బలోపేతల చేస్తాయని ఆయన తెలిపారు. నమ్మకం విశ్వాసం తో పాటు కష్టపడి పనిచేసేటువంటి తత్వాన్ని అలవర్చుకో వాలని ఆయన అన్నారు. మొక్కలు పెట్టడం కన్నా శాశ్వతంగా కొన్ని వందల సంవత్సరాలు ఉండేటువంటి మొక్కులను ఎంచుకొని పెంచే విధంగా సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఆర్గానిక్ పద్ధతుల్లో, వ్యవసాయానికి ఆసక్తి చూపించాలని అని తెలిపారు. తాను 1984లో అతి పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారని ఇది కేవలం నాడు మరొక పునర్జన్మగా తీసుకుంటున్నానని అందుకే మనం కన్నా మనం పెట్టెటువంటి మొక్కలు పర్యావరణం ప్రకృతి గొప్పదని ఆయన తెలిపారు. తన ఊపిరి ఉన్నంతవరకు ప్రకృతిని ప్రేమిస్తూ పకృతిలోనే ఆస్వాదిస్తూ ప్రకృతిలోనే ఆయన జీవితాన్ని పర్యావరణానికి ప్రకృతికి అంకితం ఇస్తానని తెలిపారు.