Vanthu : వాస్తవ కథ వంతు.. లఘు చిత్రం 

Vanthu : వాస్తవ కథ వంతు.. లఘు చిత్రం 

మహేశ్వరం, మన సాక్షి:

కీర్తి రెడ్డి క్రియేషన్ బ్యానర్ పై దర్శకుడు రావుల మోహన్ రెడ్డి నిర్మిస్తున్న కుటుంబ విలువలు చాటిచెప్పి సందేశాత్మక లఘు చిత్రం ,వంతు, లఘు చిత్రం షూటింగ్ చిత్రీకరణ సోమవారం గౌరవెల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశ చిత్రీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవెల్లి సర్పంచ్ తుడుము మల్లేష్ క్లాప్ ఇచ్చి చిత్రీకరణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిత్ర షూటింగ్ గౌరవెల్లి వివిధ ప్రాంతాల్లోని లొకేషన్ లో చిత్రీకరించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రావుల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రంలో కేవలం ఒకే పాత్రతో సినిమా మొత్తం ఉంటుందని అలాంటి అద్భుతమైన పాత్రని ప్రముఖ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య పోషించడం విశేషమని ఆయన తెలిపారు.

 

తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలని తమ జీవితాన్ని త్యాగం చేసి కడుపు కట్టుకొని కూడబెట్టిన ఆస్తులను పంచుకోవడంలో తమ వంతు ఉందని హక్కుల కోసం కొట్లాడడంతోపాటు. అదే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తమ బ్రతకడం కోసం కొడుకులు వంతులు పాటిస్తూ తల్లిదండ్రుల జీవితాన్ని దుర్భరంగా మారుస్తూ సమాజంలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నామని కుటుంబ విలువలను చాటి చెప్పే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు.

 

ఈ చిత్రానికి కెమెరామెన్ గా ఆర్బి మహా ముఖేష్ వ్యవహరిస్తుండగా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేస్తామని రావుల మోహన్ రెడ్డి తెలిపారు.