సోషల్ జస్టిస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా వీర్లపల్లి శంకర్
సోషల్ జస్టిస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా
వీర్లపల్లి శంకర్
కమిటీలో సీనియర్ నాయకులు బాబర్ ఖాన్,
జితేందర్ రెడ్డిలకు చోటు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి : రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని, పార్టీ నేతలంతా కలిసి కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తామని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర్లపల్లి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన మేధోమథనం కార్యక్రమానికి షాద్ నగర్ నుండి వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ రంగారెడ్డి జిల్లా కన్వీనరుగా “వీర్లపల్లి శంకర్” ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్లే విధంగా పార్టీకి బడుగు బలహీన వర్గాల ద్వారా జవసత్వాలు సమకూర్చేందుకు కమిటీ సిఫారసు చేసేందుకు సోషల్ జస్టిస్ కమిటీ నివేదికలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. మేధోమథనం కార్యక్రమంలో భాగంగా సంస్థాగత, రాజకీయ, వ్యవసాయ, యువజన, సామాజిక న్యాయ, ఆర్థిక కమిటీలు సమావేశమై కూలం కషంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇందులో సామాజిక న్యాయం (సోషల్ జస్టిస్) కోసం తనను కన్వీనర్ గా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని వీర్లపల్లి శంకర్ అన్నారు.
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై చర్చించినట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ను మరోమారు పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, అదే సమయంలో బీజేపీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని, కాంగ్రెస్సే ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని వీర్లపల్లి శంకర్ అభిప్రాయపడ్డారు. ఈ సామాజిక న్యాయ కమిటీ చర్చలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతపై ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంస్థాగత పదవుల్లో 50 శాతం పదవులు ఇవ్వాలన్న ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని సూచించారు. బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలని, వరంగల్‌లో చేసిన రైతు డిక్లరేషన్ తరహాలోనే బీసీ డిక్లరేషన్‌ను ఏర్పాటు చేసి ప్రకటించాలని కోరారు.
ఆయా కమిటీలు సంబంధించి షాద్ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబర్ ఖాన్ అదేవిధంగా సింగిల్విండో డైరెక్టర్ జితేందర్ రెడ్డిలకు కమిటీలో స్థానం లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీకి మేలు జరిగే విధంగా బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకు సామాజిక న్యాయంకు సంబంధించి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్ జస్టిస్ విభాగానికి తనను జిల్లా కన్వీనరుగా చేసినందుకు ధన్యవాదాలని శంకర్ పేర్కొన్నారు.
Also read :
1. పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలు ఉల్లంఘిస్తే, ఫిర్యాదు చేస్తే సరి
2. ఇంగ్లీషులో 35, లెక్కల్లో 36, ఆ కలెక్టర్ మార్కుల జాబితా వైరల్










