విద్యుత్ షాక్ తో నిండు ప్రాణం బలి
విద్యుత్ షాక్ తో నిండు ప్రాణం బలి
అధికారుల నిర్లక్ష్యమని ఆరోపణ
రంగారెడ్డి జిల్లా కేశంపేట్, మే 27, మనసాక్షి :
కేశంపేట మండల పరిధిలోని లే మామిడి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన వడ్డే రాఘవేందర్ (24) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గత వారం రోజుల క్రితం గాలిదుమారం, వడగండ్ల వాన తో విద్యుత్ స్తంభాలు నేలకు వంగిపోయాయి, ఆ పాపానికి నిండు ప్రాణం బలి అయింది. గ్రామ సమీపంలోని బొదునంపల్లి కి పోయే బండ్ల బాట పరిసరాల్లో వ్యవసాయ బోర్లకు వెళ్ళు విద్యుత్తు వైర్లు భూమి కిందకు వేలాడుతు ఉండడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్ అధికారులకు వైర్లను సరిచేయాలని విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
1. దేవరకొండ లో దొంగల బీభత్సం, నాలుగు ఇళ్లలో చోరీ చోరీ
2. ఫ్లాష్.. ఫ్లాష్.. మిర్యాలగూడలో డీసీఎం ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి
3. BREAKING : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ ఆఫీసర్స్









