Village Devolapment :  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత..!

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పల్లెల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్అన్నారు.

Village Devolapment :  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత..!

మంత్రి సత్యవతి రాథోడ్

సెప్టెంబర్. 29 మన సాక్షి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పల్లెల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్అన్నారు. దేవరకొండ నియోజకవర్గం లోని కొండమల్లేపల్లి లో కెశ్యా తండా నాంపల్లి పిడబ్ల్యుడి రోడ్డు నుండి కొత్త బావి హ o క తండా వరకు3. కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న బీటి రోడ్ నిర్మాణ పనులకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా పన్ని తండా, గుర్రపు తండా గ్రామంలో సాగర్ పిడబ్ల్యూటి రోడ్ నుండి పన్ని తండా వరకు 1.50 లక్షలతో నిర్మాణపను ల కు..ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!

చిన్న చిన్న పల్లెలను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసి ప్రతి నియోజకవర్గంలో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, జిల్లా ఎస్పీ అపూర్వరావు, దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, ట్రై కార్ చైర్మన్ రామ్ చంద్ర నాయక్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవో శ్రీరాములు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి తదితరులు పలు శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ : NBR FOUNDATION GOOD NEWS : నిరుద్యోగులకు ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. అక్టోబర్ 4న మెగా జాబ్ మేళా..!