Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : పారదర్శకంగా ఓటరు జాబితా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!

Narayanpet : పారదర్శకంగా ఓటరు జాబితా.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

జిల్లాలోని నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాలను పారదర్శకంగా తయారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో డబుల్ డబుల్ ఓటర్లను పూర్తిగా తొలగించడం జరిగిందని, అలాగే పేరు, చిరునామా, పుట్టిన తేది వివరాలను సరి చేయడం జరిగిందని చెప్పారు.

ఒకే ఓటరు పేరు రెండు పోలింగ్ కేంద్రాలలో ఉండ కుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల గురించి కలెక్టర్ వివరించారు. పార్లమెంట్ ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. నారాయణపేట నియోజకవర్గం లో 977 మంది, మక్తల్ నియోజకవర్గంలో 950 డబుల్ ఓటర్లను తొలగించడం జరిగిందన్నారు.

ALSO READ : Power plant : యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనుల పట్ల నిర్లక్ష్యం, వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే ఉపేక్షించేది లేదు.. డిప్యూటీ సీఎం బట్టి

ఈ సందర్భంగా మక్తల్ నియోజక వర్గంలో తొలగించిన ఓటర్ల లిస్టు ఇవ్వాలని ఆ నియోజకవర్గానికి చెందిన రాజకీయ పార్టీ నాయకుడొకరు కలెక్టర్ ను కోరారు. మక్తల్ తో పాటు నారాయణపేట నియోజకవర్గంలోనూ తొలగించిన డబుల్ ఓటర్ల లిస్టులను వచ్చే సమావేశంలో ఇస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మయాoక్ మిత్తల్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు బొదిగల శ్రీనివాస్, రఘురామయ్య గౌడ్, యూసుఫ్ తాజ్, వెంకట్రాంరెడ్డి, శ్యామ్ చౌద్రి, ఎన్నికల విభాగానికి చెందిన రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : First List : టిడిపి, జనసేన ఫస్ట్ లిస్ట్ ఇదే..!

మరిన్ని వార్తలు