వాడపల్లి శివాలయంలో గుత్తా, భాస్కర్ రావు పూజలు
వాడపల్లి శివాలయంలో గుత్తా, భాస్కర్ రావు పూజలు
పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు
మిర్యాలగూడ, మన సాక్షి:
మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వాడపల్లి లో శ్రీ శ్రీ శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామీ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి పూజలు నిర్వహించారు.
అదేవిధంగా అడవిదేవులపల్లి మండలంలోని సత్రశాల వద్ద ఉన్న బౌద్ధమ గుల్ల వద్ద పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ కుందుటి సిద్దయ్య వారిని శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు, అనంతరం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమన్నిప్రారంభించారు,
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం.డి.యూసుఫ్, పడిగాపాటి పెదకోటి రెడ్డి, ఎంపీపీ నందిని-రవితేజ, జడ్పీటీసీ లలిత హతిరం, సర్పంచ్ కొందుటి మాధవి సిద్దయ్య, ఎంపీటీసీ అనంతలక్ష్మీ-శ్రీనివాసరెడ్డి, బాల సత్యనారాయణ, ఉప సర్పంచులు, గ్రామపార్టీ అద్యక్షులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.











