Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంవ్యవసాయం

Godrej Agrovet : కలుపు నివారణ మందు.. ఆవిష్కరించిన గోద్రెజ్ ఆగ్రోవెట్..!

Godrej Agrovet : కలుపు నివారణ మందు.. ఆవిష్కరించిన గోద్రెజ్ ఆగ్రోవెట్..!

ముంబై/హైదరాబాద్, మనసాక్షి:

భారతదేశపు డైవర్సిఫైడ్ అగ్రి-బిజినెస్ దిగ్గజాల్లో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రెజ్ ఆగ్రోవెట్) కొత్తగా మొక్కజొన్న పంట కోసం రూపొందించిన కలుపు నివారణ మందు ‘అశితాకా’ ను (Ashitaka) ఆవిష్కరించింది. ఐఎస్కే జపాన్ భాగస్వామ్యంతో ఇది అభివృద్ధి చేయబడింది. భారతదేశంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య అయిన గడ్డి, వెడల్పాటి ఆకులు గల కలుపును సమర్ధవంతంగా నియంత్రించేందుకు ఈ వినూత్న ఉత్పత్తి ఉపయోగపడుతుంది.

పంట ప్రారంభ దశలో కలుపు పెరిగిపోవడం వల్ల మొక్కజొన్న దిగుబడిపై గణనీయంగా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో 2-4 కలుపు ఆకుల దశలో అశితాకాను వాడితే కలుపును నియంత్రించేందుకు సమర్ధవంతంగా పని చేస్తుంది. అంతర్జాతీయంగా మొక్కజొన్న సాగుకు సంబంధించి విస్తీర్ణంపరంగా భారత్ 4వ స్థానంలో, వార్షిక ఉత్పత్తిపరంగా 5వ స్థానంలో ఉంది.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ, మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మాంసాహార ప్రొటీన్, స్టార్చ్, మరియు మొక్కజొన్నను ఉపయోగించే ఇతరత్రా పారిశ్రామికోత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అనేక సంవత్సరాలుగా పశువుల ఆహారం, పరిశ్రమలు, బయోఫ్యూయల్ మొదలైన అవసరాల కోసం దేశీయంగా మొక్కజొన్నలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.

అయితే, నాణ్యమైన విత్తనాలు, ఇతరత్రా ముడివనరుల లభ్యత పరిమితంగానే ఉండటమనేది వృద్ధికి ప్రతిబంధకంగా మారడంతో పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు మరో ముప్పుగా పరిణమించాయి. కఠినతరమైన వాతావరణ పరిస్థితులు, మారుతున్న వర్షపాతం తీరుతెన్నులు, పురుగులు మరియు వ్యాధులు మొదలైనవి మొక్కజొన్న ఉత్పత్తికి అవరోధాలుగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో పంట దిగుబడిని పెంచేందుకు, మొక్కజొన్న ప్రాధాన్యతను స్థిరంగా నిలిపేందుకు అశితాకాలాంటి పరిశోధన ఆధారిత ఉత్పత్తుల అవసరం కీలకంగా మారింది.

“పర్యావరణం, మార్కెట్పరమైన సవాళ్ల నుంచి రక్షణ కల్పిస్తూ వ్యవసాయాన్ని భవిష్యత్ పరిస్థితులకు సిద్ధం చేయడం ద్వారా భారతీయ రైతులకు, వ్యవసాయ కుటుంబాలకు సాధికారత కల్పించడంలో ఉపయోగపడే వినూత్నమైన, పరిశోధన ఆధారితమైన సొల్యూషన్స్ అందించడం గోద్రెజ్ ఆగ్రోవెట్ లక్ష్యం. మొక్కజొన్న రైతులు మెరుగైన దిగుబడులు పొందాలంటే పంట ప్రారంభ దశలో కలుపును నియంత్రించడం చాలా కీలకం.

భారత్లో ఈ తరహా ఉత్పత్తులకు సంబంధించి తొలిసారిగా అశితాకాను ఆవిష్కరించడమనేది, రైతులకు మెరుగైన దిగుబడులు, లాభదాయకతను పెంపొందించే శక్తివంతమైన సాధనాన్ని అందించే దిశగా ఒక కీలక ముందడుగు కాగలదు” అని గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈవో (క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్) రాజావేలు ఎస్కే (Rajavelu NK) తెలిపారు.

“మొక్కజొన్న పంటలో కలుపును నియంత్రించేందుకు అశితాకా సమర్ధవంతంగా పని చేస్తుంది. నేలలో పరిమితంగా ఉండే తేమ, పోషకాలను మెరుగ్గా ఉపయోగించుకునేందుకు, పూత, గింజలాంటి కీలక దశల్లో మొక్క ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన మద్దతునిస్తుంది. 2-4 కలుపు ఆకుల దశలో ఎకరాకు 50 ఎంఎల్ అశితాకాకు, 400 ఎంఎల్ సర్ఫెక్టెంట్ను కలిపి వాడాలి. ఇది కలుపును ప్రారంభ దశలోనే నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.

కలుపు సంబంధ దిగుబడి నష్టాలను తగ్గిస్తుంది. ఫలితంగా ఉత్పత్తి స్థిరంగా ఉండటం, గింజలు నాణ్యంగా ఉండటం, అలాగే ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో, హెచ్చుతగ్గులకు లోనయ్యే రైతుల ఆదాయానికి పటిష్ట రక్షణ కవచంగా మారుతుంది” అని గోద్రెజ్ ఆగ్రోవెట్ జీఎం (మార్కెటింగ్, క్రాప్ ప్రొటెక్షస్ బిజినెస్) అనిల్ చౌబే తెలిపారు.

ముందుగా మొక్కజొన్న ఎక్కువగా పండించే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ప్రవేశపెట్టిన అశితాకాను, రాబోయే నెలల్లో మొక్కజొన్న పండించే మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ అందుబాటులోకి తేవాలని గోద్రెజ్ ఆగ్రోవెట్ నిర్దేశించుకుంది.

MOST READ : 

  1. Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!

  2. Job Mela : నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. జాబ్ మేళా ఎప్పుడంటే..!

  3. Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!

  4. Robot : అచ్చం అమ్మాయిలా ఆకట్టుకున్న రోబో.. ప్రసంగించిన తీరుకు విద్యార్థినుల ఫిదా..!

  5. District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు