Coins : పదివేల నాణాలతో.. అద్భుత చిత్రం..!

యోగా అనేది ఒక గొప్ప సాధనమని,10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్య నమస్కారం చేస్తున్న యోగా చిత్రాన్ని 10వేల ఐదు రూపాయల నాణాలతో అద్భుత చిత్రాన్ని తయారు చేశారు.

Coins : పదివేల నాణాలతో.. అద్భుత చిత్రం..!

గజ్వేల్, మనసాక్షి :

యోగా అనేది ఒక గొప్ప సాధనమని,10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్య నమస్కారం చేస్తున్న యోగా చిత్రాన్ని 10వేల ఐదు రూపాయల నాణాలను ఉపయోగించి 10అడుగుల పొడవుతో రెండు రోజులు శ్రమించి అత్య అద్భుతంగా రూపొందించి,శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వలన శరీరానికి, మనస్సుకు మానసిక ప్రశాంతత చేకూరుతుందని, చక్కని ఆరోగ్యం కోసం నిర్వహించే అతిపెద్ద ప్రజా ఉద్యమంలో యోగారోజు ఒకటన్నారు. తనువు,మనస్సు,ఆత్మను ఏకం చేసే ఒక సాధనమే యోగా అన్నారు.గత సారి బియ్యం గింజలతోను, సబ్బుబిళ్ల మీద చిత్రించానన్నాడు.

ALSO READ : 

Suicide : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య..!

BIG BREAKING : రైతులను రుణ విముక్తులను చేస్తాం.. కట్ ఆఫ్ డేట్ ఇదే..! రేవంత్ ప్రకటన..!