Nalgonda : నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం.. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఇదే..!
Nalgonda : నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం.. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఇదే..!
నల్గొండ, మన సాక్షి ప్రతినిధి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం మండలంలో నూతనంగా నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ – 2 ను శనివారం ముఖ్యమంత్రి విజయవంత రెడ్డి ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇరిగేషన్ శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
పవర్ ప్లాంట్ లో యూనిట్-2 ద్వారా విద్యుదుత్పత్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఒక సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ విజయోత్సవాలు చేసుకుంటున్నారని అన్నారు. సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయమనే నినాదంతో ముందుకు కొనసాగుతున్నామని, అదే పద్ధతిలో మరో నాలుగు సంవత్సరాల పరిపాలన కొనసాగించ బోతున్నాం అన్నారు.
ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడంలో భాగంగానే 800 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ను మిర్యాలగూడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం సంతోషదాయకం,
ఇది జిల్లా చరిత్రలో నిలబడబోతుంది అని అన్నారు.
రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన వివరాలు :
రెండు గంటలకు హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 2. 25 గంటలకు బ్రాహ్మణ వెల్లంల లో దిగుతారు. 2.40 గంటల నుంచి 2.50 వరకు బ్రాహ్మణ వెల్లంల పైలాన్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 2 50 గంటలకు కు తిరిగి వెల్లంల నుంచి బయలుదేరుతారు.
3.15 గంటలకు దామర చర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ కు చేరుకుంటారు. 3. 20 గంటలకు పవర్ ప్లాంట్ యూనిట్ – 2 పంపిస్తారు. 4.10 గంటలకు యాదాద్రి నుంచి బయలుదేరుతారు. 4.25 గంటలకు నల్గొండ లోని జీవి గూడ మెడికల్ కళాశాలకు చేరుకుంటారు.
4.30 గంటలకు మెడికల్ కళాశాల ప్రారంభిస్తారు. 5 నుంచి 6 గంటల వరకు గంధం వారి గూడెం లోని పబ్లి క్ మీటింగ్ లో పాల్గొంటారు. 6 గంటల అక్కడ నుంచి బయలుదేరి 7:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
MOST READ :
-
Suryapet : హుజూర్ నగర్ బస్టాండ్ కు రోజుకు 170 బస్సులు వస్తున్నాయి..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!
-
Nalgonda : నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం.. లక్ష మందితో బహిరంగసభ.. మంత్రి కోమటిరెడ్డి..!
-
WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!











