యాదవ, కురుమల అభివృద్దే కేసీఆర్ లక్ష్యం – ఎమ్మెల్యే కూసుకుంట్ల
యాదవ, కురుమల అభివృద్దే కేసీఆర్ లక్ష్యం
–మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్, మన సాక్షి .
యాదవ కురుమలు అభివృద్ధి చెందాలనద్దే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని జయశ్రీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన యాదవ కురుమల లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనమును, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన అయోధ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన, ఈ కార్యక్రమమునకు స్థానిక మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవ కురుమలు అభివృద్ధి చెందాలని రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. యాదవ కురుమలు అభివృద్ధి చెందాలని మునుగోడు నియోజకవర్గంలో 7671 మంది లబ్ధిదారులకు 93 కోట్ల 63 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారుల అకౌంట్లో ₹1,58,000 రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు వారికి నచ్చిన చోట గొర్రెలు కొనుక్కోవడం కోసం, వారికి అవగాహన కల్పించడం కోసం ఆత్మీయ సమ్మేళనంతో కూడిన ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు. లబ్ధిదారు ఎవరు మోసపోకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధి పొందాలని సూచించారు.
అనంతరం షిప్ అండ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి గొర్రెల పెంపకంలో సభ్యులుగా చేర్చుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన అయోధ్య యాదవ్, తెలంగాణ షిప్ అండ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, యాదాద్రి భువనగిరి డివిహెచ్ఓ డాక్టర్ వి కృష్ణ, ఏడి ఐలయ్య, జెడ్పిటిసి భానుమతి వెంకటేశం గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, యాదవ సంఘం మండల అధ్యక్షులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్, స్థానిక నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









