యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రదీప్ కుమార్
యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రదీప్ కుమార్
మణుగూరు,. మన సాక్షి :
భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భద్రాచలం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు ఎడారి ప్రదీప్ కుమార్ నియమితులైనట్టు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శివసేనా రెడ్డి సంబధిత నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ…
జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు,పెద్దలు పొదేం వీరయ్య కి అలాగే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోరిక సాయిశంకర్ నాయక్ ప్రోత్సాహం మరియు ప్రోద్బలంతో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గురజాల యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ ముదిరాజ్
ఎంతో భాధ్యతాయుతమైన జిల్లా పదవిని కట్టబెట్టడం చాలా సంతోషము మరియు ఆనందదాయకమని హార్షం వ్యక్తం చేశారు.కష్టపడేవారికి ఫలితం ఉంటుంది.అందుకు నిదర్శనం నాకు కేటాయించిన భాధ్యతే అంటూ వ్యాఖ్యాణించారు.
తనపై పెట్టిన ఈ బాధ్యతపట్ల,జిల్లా స్థాయిలో పదవికి వన్నె తెచ్చేలా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ తరపున ప్రజల పక్షాన నిలిస్తానని తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపట్ల నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అలుపెరగని పోరాటం చేస్తానని అన్నారు.
అందుకుగానూ జిల్లా యూత్ కాంగ్రెస్ ని సైతం ఒక తాటిపైకి తెచ్చేలా కృషిచేస్తానని అలాగే సమన్వయంతో మెలిగేలా పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేసారు.జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం పట్ల యూత్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.









