Youtube : యూట్యూబర్స్ కు గుడ్ న్యూస్

Youtube : యూట్యూబర్స్ కు గుడ్ న్యూస్

మనసాక్షి , వెబ్ డెస్క్ :

యూట్యూబర్స్ కు యూట్యూబ్ ప్లాట్ ఫామ్ గుడ్ న్యూస్ చెప్పింది. వీడియో షేరింగ్ యూట్యూబ్ ను ప్లాట్ ఫారం గా ఉంచుకొని డబ్బులు సంపాదించే వారికి గుడ్ న్యూస్ తెలియజేసింది. షార్ట్ వీడియోస్ చేసి డబ్బులు సంపాదించేందుకు సంబంధించిన అర్హతను తగ్గించింది. వైపిపి (యూట్యూబ్ పార్ట్ నర్ ప్రోగ్రాం ) లో చేరేందుకు అవకాశాలను మెరుగుపరిచింది.

క్రియేటర్లకు మ్యానిటైజేషన్ లో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది . గతంలో యూట్యూబ్ ఛానల్ కు 1000 మంది సబ్ స్రైబ్ లు, 4000 వాచ్ హవర్స్ ఉంటే వైపిపిలో చేరిపోవచ్చు.

కానీ ప్రస్తుతం సవరించిన విధానం ప్రకారం 500 మంది సబ్ స్రైబర్లు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 3000 వాచ్ హవర్స్ మాత్రమే ఉంటే వైపిపిలో చేరిపోవచ్చు.

 

షార్ట్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనల ప్రకారం యూట్యూబ్ వీడియోలు మధ్యలో వచ్చే యాడ్ వాచ్ టైం ను బట్టి ఇన్ కమ్ జనరేట్ అవుతుంది అనే విషయం తెలిసిందే. ప్రపంచంలోని యూఎస్, యూకే లతోపాటు మరికొన్ని దేశాలలో అందుబాటులోకి రాగా భారత్ లో ఈ నిబంధన ఎప్పటి నుంచి వస్తుందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇