టీడీపీ ప్రభంజనంతో గల్లంతైన వైఎస్సార్‌ సీపీ..!

రాష్ట్రంలో సునామీలా వీచిన టీడీపీ ప్రభంజనంతో ఒక్కసారిగా వైఎస్సార్‌ సీపీ తుడిచిపెట్టుకుపోయిందని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో టీడీపీ ఘనవిజయానికి గుర్తుగా ఆంధ్రుల ఆరాధ్యదైవం, అభిమాననటుడు, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహానికి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.

టీడీపీ ప్రభంజనంతో గల్లంతైన వైఎస్సార్‌ సీపీ..!

బడుగుబలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్‌టీఆర్‌

చంద్రబాబు పాలనలో అభివృద్ధి పథం

మదనపల్లె టౌన్, మన సాక్షి :

రాష్ట్రంలో సునామీలా వీచిన టీడీపీ ప్రభంజనంతో ఒక్కసారిగా వైఎస్సార్‌ సీపీ తుడిచిపెట్టుకుపోయిందని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో టీడీపీ ఘనవిజయానికి గుర్తుగా ఆంధ్రుల ఆరాధ్యదైవం, అభిమాననటుడు, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహానికి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లాడుతూ.. టీడీపీ దెబ్బకు వైఎస్సార్‌ సీపీ అడ్రస్‌ గల్లంతైందన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్‌టీఆర్‌కే దక్కిందన్నారు. బడుగు, బలహీనవర్గాల శ్రేయస్సుకు, అందరి జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు, సమానత్వాన్ని సాధించేందుకు అందరినీ కలుపుకుని మంచి పరిపాలన అందించే ఉద్దేశంతో ఎన్‌టీఆర్‌ టీడీపీని స్థాపించారన్నారు.

అదే స్ఫూర్తిని చంద్రబాబునాయుడు కొనసాగిస్తూ, నేడు బడుగు,బలహీనవర్గాల, పేద ప్రజల ఆశాజ్యోతిగా పనిచేస్తున్నారన్నారు. 14 ఏళ్లు రాష్ట్రముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అనుభవం, పరిపాలన దక్షతను చూసిన ప్రజలు, మరో 5 ఏళ్లు పాలించేందుకు అవకాశం ఇచ్చారన్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కోసం 33వేల ఎకరాల్లో రాష్ట్ర రాజధాని, బీసీల కోసం ప్రత్యేక చట్టం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో తీసుకువచ్చి అందరి శ్రేయస్సు, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తారన్నారు.

ఎన్నికల కోడ్‌ ఈనెల 6వ తేదీ వరకు ఉన్నందున, ప్రస్తుతం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, నివాళులు అర్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొడవలి శివప్రసాద్, నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, ఆర్‌.నీలకంఠ, మోడెం సిద్ధప్ప, బాబునాయుడు, పులిమహాలక్ష్మి, రాధ, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!

బ్రెయిన్ ట్యూమర్ తో 11 ఏళ్ల చిన్నారి మృతి..!

Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!

BREAKING : దామరచర్ల వైటిపిఎస్ లో రూ.1.49 కోట్ల విలువైన అల్యూమినియం షీట్ల చోరీ.. చాకచక్యంగా చేదించిన పోలీసులు..!