వైయస్సార్ టిపి నూతన కమిటీల ఎన్నిక

వైయస్సార్ టిపి నూతన కమిటీల ఎన్నిక

మిర్యాలగూడ, మనసాక్షి : వైయస్సార్ తెలంగాణ పార్టీ నూతన కమిటీలను ఆ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇంజం నర్సిరెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో మండల, పట్టణ కమిటీలను ఆయన నియమించారు.

నూతన కమిటీలు : 

  • మిర్యాలగూడ మండల అధ్యక్షులుగా పిల్లుట్ల బ్రహ్మం.
  • దామరచర్ల మండల అధ్యక్షులుగా అన్నం కరుణాకర్ రెడ్డి.
  • వేములపల్లి మండల అధ్యక్షులుగా దైద ప్రేమ్ కుమార్.
  • మాడుగుల పల్లి మండల అధ్యక్షులుగా కట్టా శ్రీనివాస్ రెడ్డి.
  • మిర్యాలగూడ పట్టణ -1 అధ్యక్షులుగా తంగేళ్ల నరేందర్ రెడ్డి.
  • మిర్యాలగూడ పట్టణ -2 అధ్యక్షులుగా అనంతుల కిరణ్.

గూడూరులో గడపగడపకు వైయస్సార్ టిపి :

మిర్యాలగూడ మండలంలోని గూడూరులో గడప గడపకు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ టిపి నాయకులు గోలి అమరయ్య, పరంగి మధు, గట్టు శ్రవణ్, దుండిగాల మురళి, సూరేపల్లి తిలక్, మాతంగి అఖిల్, పరంగి మహేష్ తదితరులు పాల్గొన్నారు.