Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Ambulance : 108 అంబులెన్స్ లో ప్రసవం..!
Ambulance : 108 అంబులెన్స్ లో ప్రసవం..!
ఆర్మూర్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రవితకు ఆదివారం ఉదయం తీవ్రమైన కాన్పు నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.
స్పందించిన ఈఎంటి శాంతా, పైలట్ రమేష్, ఆశా వర్కర్ పుష్ప కలిసి రవితను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలోనే రవితకు ప్రసవ వేదనలు తీవ్రమవ్వడంతో సిబ్బంది సహకారంతో ఆమెకు సాధారణ ప్రసవం జరిగి పండంటి ఆడబిడ్డ జన్మించింది.
అనంతరం తల్లి, శిశువును దేగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ఈ కష్టసమయంలో సహాయపడిన 108 అంబులెన్స్ సిబ్బందికి, ఆశా వర్కర్‌కి రవిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.









