Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు..!

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు..!

రామసముద్రం, మనసాక్షి:

అన్నమయ్య జిల్లా మండలంలో ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో 76 వ గణతంత్రవేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయయం, పోలీస్ స్టేషన్ ,వెలుగు కార్యాలయం,  ఎక్స్సైజ్ పోలిస్ స్టేషన్ , తదితర ప్రభుత్వ కార్యాలయాలు,గ్రామ సచివాలయలు, కాలేజిలు, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు, నాయకులు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలంతో భారత దేశానికి స్వాతంత్రం వచ్చిందని, భరత మాతకు విముక్తి కల్పించేందుకు స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించారని పేర్కొన్నారు. అలాంటి మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో నడవాలని , వారి స్ఫూర్తితో సమాజ సేవలో పాల్గొనాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి కుసుమకుమారి,జడ్పీటీసీ రామచంద్రారెడ్డి తాహిసీల్దార్ నిర్మాలాదేవి, ఎంపిడిఓ భానుప్రసాద్, ఎస్సై వెంకటసుబ్బయ్య, డాక్టర్ లీల,గౌష్ భాషా,సుధాకర్ రెడ్డి, మోహనకుమార్,ఎక్స్చేంజ్ ఎస్సై నారాయణస్వామి, ఎంఈవో హేమలత, మంజునాథ్,రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది,సచివాలయం సిబ్బంది,పాఠశాల ప్రధానోపాధ్యయులు ఏపీ మోడల్ ప్రిన్సిపాల్ మునిస్వామి నాయక్ చిట్టి బాబు, బాలసుబ్రమణ్యం, తూర్పుపాఠశాల హెచ్ ఎం హేమలత తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై వుంది — కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ — రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

జాతీయ జెండాను ఎగురవేసి, జెండా వందనం చేశారు. జాతీయ గీతం ఆలపించారు. ‌ఈ సందర్భంగా ఎస్.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, యావత్ ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువలను అందించడంలో మ‌న దేశం అగ్రగామిగా నిలిచిందని అలాంటి ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు మనందరం ఎంతో గర్వకారణంగా భావించాలన్నారు.

1947 ఆగస్టు 15 వ తేదీన మన దేశానికి స్వతంత్రం వచ్చిందని, తర్వాత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 1950 జనవరి 26 వ తేదీ నుంచి మనకు సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించిందని, అప్పటినుంచి మనం గణతంత్ర దినోత్సవం వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ దేశానికి ఒక అపురూపమైనటువంటి పునాదిని అందించిందని, భారత రాజ్యాంగం పునాది పైనే మన దేశం ప్రజాస్వామిక విలువలను రూపొందించుకుంటుందని, శాస్త్రీయ అవగాహన, లౌకికత్వం, జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ ప్రజాస్వామిక విలువలు మనందరికీ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించాయని తెలిపారు.

అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రిపబ్లిక్ డే సందర్బంగా దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా కదలాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉద్ఘాటించారు. అనంతరం స్థానిక ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వీట్స్ పంచిపెట్టారు. ‌

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా మాజీ ఉపాధ్యక్షురాలు మీనాకుమారి, రాష్ట్ర మైనారిటీ మాజీ ఉపాధ్యక్షులు ఎస్‌కే. బాషా, నిమ్మనపల్లి మండల మాజీ అద్యుక్షలు ముబారక్ ఖాన్, సోము (బాబు ), సోషల్ మీడియా కన్వీనర్ ఎస్ఎం. రఫీ, ఈశ్వరమ్మ, మహబూబ్ పీర్, శరత్ కుమార్ రెడ్డి, మహమ్మద్, రవీంద్ర, నాగరాజ, బయ్యారెడ్డి, షామీర్, ఖాసీం, సోను, సుహైల్ వెంకటరమణ, దిలీప్, రాజు, గుల్షన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!

  2. IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!

  3. Hyderabad : భార్యను చంపి ముక్కలు చేసిన ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..!

  4. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు