Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

రాంరెడ్డి ఆశయాలను నెరవేర్చాలి

రాంరెడ్డి ఆశయాలను నెరవేర్చాలి

వర్ధంతి సభలో నేతలు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

వేముల రాంరెడ్డి ఆశయాలను సాధించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. సోమవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వేముల రామ్ రెడ్డి ప్రధమ వర్ధంతి సభ నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపించే వారని చెప్పారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. హౌసింగ్ బోర్డ్, విద్యానగర్ ప్రాంతాలలో పేదల పక్షాన ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు.

 

కౌన్సిలర్గా అనేక సేవలు అందించాలని ఆయన మరణం పార్టీకి కుటుంబ సభ్యులకు తీరనిలోటు అన్నారు. ఆయన చూపిన మార్గాన్ని ఎంచుకొని ఆయన ఆశాయ సాధన కోసం కార్యకర్తలు పాటుపడాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడవత్ రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి,భవాండ్ల పాండు, శశిధర్ రెడ్డి, గాదె పద్మ సత్యనారాయణ రావు, చెనగని యాదగిరి, దేశిరం నాయక్, కోటి రెడ్డి, రాంచంద్రు, మల్లయ్య, రాములు, అఫాన్ అలీ, మాధవ రెడ్డి,పల్లా బిక్షం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు