Braking News : చిట్టీల పేరుతో టోకారా, బీజేపీ దూకుడుకు బ్రేక్, కొడుకు హత్య.. మన సాక్షి టాప్10 ఫ్లాష్ న్యూస్..!
మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. స్థానిక నుంచి రాష్ట్రస్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్లాష్ న్యూస్ మీకోసం..

Braking News : చిట్టీల పేరుతో టోకారా, బీజేపీ దూకుడుకు బ్రేక్, కొడుకు హత్య.. మన సాక్షి టాప్10 ఫ్లాష్ న్యూస్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. స్థానిక నుంచి రాష్ట్రస్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్లాష్ న్యూస్ మీకోసం..
ఉరి వేసుకున్న వ్యక్తిని సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్
- నల్గొండ జిల్లా చండూర్ మండలం ఉడుతలపల్లి గ్రామంలో భార్యతో గొడవ పడి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సైదులు అనే వ్యక్తి
- స్థానికులు 100కు కాల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకొని మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి సైదులుకు సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్
- కానిస్టేబుల్ శ్రీనివాస్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్న గ్రామస్తులు
22 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి బ్రేక్ వేసిన ప్రశాంత్ కిషోర్
- బీహార్ రాష్ట్రం బంకీపూర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
- బంకీపూర్ నియోజకవర్గంలో గత 22 ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కుటుంబం
- కుక్కని నిలబెట్టినా గెలుస్తామని గతంలో ప్రకటించిన ఓ బీజేపీ ఎంపీ
- బీజేపీ ఎంపీ అహంకారానికి గట్టి సమాధానం ఇచ్చిన ప్రజలు
చిట్టీల పేరుతో 4 కోట్ల టోకరా
- అందరిని నమ్మించి అందిన కాడికి దోచుకున్న భార్యాభర్తలు.
- ఆస్తులన్ని అమ్ముకుని రాత్రికి రాత్రి పారిపోయిన దంపతులు.
- గుంటూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు శిరీష, సాంబశివరావు అమీన్పూర్ BSR. కాలనీలో నివాసం.
- బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు.
సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కండక్టర్
- మహారాష్ట్రలోని శంభాజీ నగర్ బస్‌స్టాండ్‌లో కూర్చున్న చోటే గుండెపోటుకు గురైన మహిళా ప్రయాణికురాలు
- ఇది గమనించి వెంటనే అప్రమత్తమై సీపీఆర్ చేసి, ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన ఓ మహిళా కండక్టర్
ఇన్‌స్టా రీల్స్ వివాదం.. టీచర్ సంచలన నిర్ణయం!
- ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఖమ్మం మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల టీచర్ గౌతమి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
- ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ల ప్రమోషన్ వ్యవహారంలో 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఇటీవలే విధుల్లో చేరిన ఆమె, సహోద్యోగుల ట్రోలింగ్, మానసిక వేధింపులు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
- తనపై కఠిన చర్యలు తీసుకోవడం తీవ్ర బాధ కలిగించిందని, ఎదుర్కొన్న పరిస్థితులు మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టాయని భావోద్వేగంతో వెల్లడించారు.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో కూడా గృహ హింస చట్టం వర్తిస్తుంది
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళలు వేధింపులకు గురైతే, గృహ హింస చట్టం కింద కేసులు నమోదు చేయొచ్చని తెలిపిన సుప్రీంకోర్టు
- కానీ తాము వివాహం చేసుకునే ఉద్దేశంతోనే కలిసి ఉన్నట్టు ఫిర్యాదు చేసిన మహిళ నిరూపించాల్సి ఉంటుందని పేర్కొన్న న్యాయమూర్తి
లిఫ్ట్ పేరుతో దోపిడీ – ఆరుగురు అరెస్ట్
ఆల్వాల్‌లో లిఫ్ట్ పేరుతో ద్విచక్ర వాహనదారుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కత్తితో బెదిరించి రూ.5,000 నగదు, Google Pay ద్వారా రూ.800 దోచుకున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక కత్తి, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
స్కూల్‌లోకి 5 అడుగుల పాము..
• మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం నాసర్‌రెడ్డినగర్ ఎంపీపీ స్కూల్‌లో ఘటన..
• క్లాస్‌రూమ్‌లోకి దూరిన పాము..
• పామును చూసి భయంతో బయటకు పరుగులు తీసిన విద్యార్థులు..
• స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులు..
• బెంచీల చాటున దాక్కున్న 5 అడుగుల పామును సురక్షితంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్..
ప్రియుడి కోసం కొడుకు హత్య
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం ఆరు నెలల కుమారుడు సమీర్‌ను తల్లి షబ్నమ్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి హల్‌చల్
పాములపాడు మండలం ఎర్రగుడూరు వద్ద జాతీయ రహదారిపైకి ఎలుగుబంటి రావడం కలకలం రేపింది. వాహనదారుల అరుపులతో అది తిరిగి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. రాత్రివేళ ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.
Most Viewes :
- Viral : రైతు సాహసం.. మొసలిని భుజంపై మోస్తూ పోలీస్ స్టేషన్ కు.. వీడియో వైరల్..!
- Fake Certificate : భార్య సర్టిఫికెట్తో మోసం.. వీఆర్ఏ నుంచి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం..!
- Narayanpet : నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం..!
- Srisailam : శ్రీశైలం జలశయానికి భారీ వరద ఉధృతి.. క్రస్ట్ గేట్లను తాకిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!









