NH 65 : ఎన్ హెచ్ 65 పై 19 హాట్ స్పాట్ లు.. ఎక్కడెక్కడో..? నిధులు మంజూరు ..!
NH 65 : ఎన్ హెచ్ 65 పై 19 హాట్ స్పాట్ లు.. ఎక్కడెక్కడో..? నిధులు మంజూరు ..!
హైదరాబాద్ , మనసాక్షి :
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (65) పై వాహనాల రద్దీ బాగా పెరగడం వల్ల ఆరు లైన్ల రోడ్డుగా మార్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు ప్రధాని మోడీని, కేంద్రమంత్రి నితిన్ ఘాట్ కారిని కలిసి వినతి పత్రాలు అందజేశారు. కాగా జాతీయ రహదారి 65 లో 19 హాట్ స్పాట్ ల ను కేంద్ర రోడ్ల రవాణా శాఖ గుర్తించింది.
రూ . 420 కోట్ల మంజూరు :
అందుకుగాను 420 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ ఘాట్ కారిని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
19 హాట్ స్పాట్ లు ఎక్కడంటే ..?
హైదరాబాద్ విజయవాడ మధ్య గుర్తించిన హాట్స్పాట్లలో చౌటుప్పల్, టేకుమట్ల, పెద్ద కాపర్తి , చిట్యాల, నల్గొండ క్రాస్ రోడ్డు, కట్టంగూర్, కొర్లపహాడ్, ఎస్ వి కాలేజ్, జనగామ క్రాస్ రోడ్డు, ఈనాడు కార్యాలయం ఎదురుగా, దురాజ్‌పల్లి, ముకుందాపురం, ఆకు పాముల, కొమరబండ క్రాస్ రోడ్డు , కటకమ్మ గూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, రామాపురం క్రాస్ రోడ్డు, నవాబుపేట. ఉన్నాయి









