Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Whatsapp Gas Booking : వాట్సప్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఈజీ.. ఎలానో తెలుసుకుందాం ..!

Whatsapp Gas Booking : వాట్సప్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఈజీ.. ఎలానో తెలుసుకుందాం ..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

మెసేజ్ లకు, చాటింగ్ లకు ఎక్కువగా ఉపయోగించేది వాట్సాప్. ఇప్పుడు వాట్సప్ రోజుకు సరికొత్త ఫీచర్లతో ముందుకు వస్తుంది. వాట్సప్… యూజర్లకు అనేక రకాలుగా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు సరికొత్త ఈ కామర్స్ గా సేవలు అందిస్తుంది.

 

గతంలో మనం గ్యాస్ బుకింగ్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ టైప్ చేసి బుకింగ్ ఆప్షన్ చేసేవాళ్లం. కానీ సరికొత్తగా ఇప్పుడు వాట్సప్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే ఆప్షన్ అందిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ విధానం చాలా సులభంగా ఉంటుంది.

భారత్, హెచ్ పి, ఇండేన్ గ్యాస్ వాట్సప్ ద్వారా బుకింగ్ సేవలు అందిస్తున్నాయి. అదే విధంగా డైరెక్టుగా పేమెంట్ ఆప్షన్ కూడా దీనిలోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ తో సంబంధిత ఏజెన్సీ నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్ లో బుకింగ్ చేయవచ్చును.

ALSO READ : Ts rtc : ఆర్టీసీలో విలేజ్ బస్ ఆఫీసర్లు… కొత్తగా నియామకం

Bharath Gas :

భారత్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయడానికి 1800224344
నెంబర్ ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా Hi అని మెసేజ్ చేయాలి. బుకింగ్ సిలిండర్, పేమెంట్ రివార్డ్స్ , అండ్ అవార్డ్స్, వంటి ఆప్షన్లు వస్తాయి. దానిలో కావలసిన ఆప్షన్ ఎంచుకోవాలి. దానిలో గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే ద్వారా పేమెంట్ కూడా చేయవచ్చును.

HP Gas : హెచ్ పి గ్యాస్ వినియోగదారులు 9222201122 నెంబర్ ఫోన్ లో సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా BOOK అని టైప్ చేస్తే సిలిండర్ బుకింగ్ , పేమెంట్ చేయవచ్చు. బుకింగ్ తో పాటు పలు ఆప్షన్లు కూడా వస్తాయి.

Indane Gas : ఇండేన్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం 7588888824, 7718955555
నెంబర్లను ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సాప్ లో ‘REFILL” అని టైప్ చేస్తే గ్యాస్ బుకింగ్ ఆప్షన్ వస్తుంది. కావలసిన దాన్ని ఎంచుకొని పేమెంట్ కూడా చేయవచ్చును.

మరిన్ని వార్తలు