Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet | సూర్యాపేట మున్సిపాలిటీ కి మరో అవార్డ్

Suryapet | సూర్యాపేట మున్సిపాలిటీ కి మరో అవార్డ్

సూర్యాపేట : మనసాక్షి :

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి అవార్డ్ దక్కింది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ,ఆలోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి అవార్డ్ అందుకున్నారు.

పురపాలక సంఘము,సూర్యాపేట నందు అవలంబిస్తున్న ఘన వ్యర్ధ మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను శాస్త్రీయ పద్దతిలో తీసుకుంటున్న చర్యలలో భాగంగా తడి చెత్తను ఎరువుగా చేసి అమ్ముట ,ప్లాస్టిక్ వ్యర్ధాలతో టైల్స్ ,బ్రిక్స్ తయారు చేస్తూ ఇతర మున్సిపాలిటీ లకు ఆదర్శంగా నిలిచింది.

 

ALSO READ : Phonepe : ఫోన్ పే వాడుతున్నారా…? అయితే మీకు ఓ గుడ్ న్యూస్..!

 

అందుకు గాను జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 1 లక్ష ఫైన జనాభా గల మున్సిపాల్టీలలో సూర్యాపేట కు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారిచే అవార్డు రావడం జరిగింది అని మున్సిపల్ కమీషనర్ పి.రామానుజులరెడ్డి తెలిపారు.

 

పర్యావరణ దినోత్సవము సందర్భంగా పట్టణంలోని ప్రతి ఇంటి నుండి సేకరించు తడి చెత్తను కంపోస్ట్ యార్డ్ నందు 100 శాతము ఎరువుగా మార్చి రూ.5/ లకు అమ్మడము మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలతో ప్లాస్టిక్ టైల్స్ మరియు బ్రిక్స్ తయారు చేయడంమరియు ప్రస్తుతం పట్టణంలో పొడి చెత్తను కూడా రూ. 5/-లకు ప్రతి వార్డునందే త్రిబుల్ ఆర్ సెంటర్ లను ఏర్పాటు చెసికొనుగోలు చేయడం జరుగు తున్నందన్నారు.

 

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అవార్డు కు ఎంపిక చేయుట జరిగింది అన్నారు. దీనిలో భాగంగా సోమవారం హైద్రాబాద్ లో మంత్రుల చేతుల మీద అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు